AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

సినిమాల్లో విలన్ అంటే రఫ్ గా ఉండాలనే నియమాన్ని మార్చిన నటుడు రఘువరన్. స్టైలీష్ విలన్ గా అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు
Raghuvaran
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 2:36 PM

Share

విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటుడు రఘువరన్. శివ, పసివాడి ప్రాణం వంటి చిత్రాలతో తనదైన శైలిని ఆవిష్కరించారు. భయంకరమైన అరుపులు, కేకలకు స్వస్తి చెప్పి, ఆధునిక శైలిలో విలనిజాన్ని పండించిన ఘనత ఆయనది. విలన్‌గా మాత్రమే కాకుండా తండ్రి పాత్రలలోనూ మెప్పించి, 200కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు రఘువరన్. తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసిన రఘువరన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. 1990 దశకంలో ఆయన చెప్పిన రెండు లారీలు జనాన్ని తీసుకెళ్లి నరికేయండి వంటి డైలాగులు తెలుగునాట ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పనవసరం లేదు. విలన్‌కు కొత్త అర్థం చెప్పిన నటుడిగా రఘువరన్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

తెలుగులో ఆయన నటించిన తొలి చిత్రం కాంచనసీత. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఆయనకు పూర్తి గుర్తింపు తెచ్చిన చిత్రం చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం. ఇందులో పోలియో వ్యాధి వచ్చిన విలన్ గా నటించాడు. ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. రఘువరన్ నటన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ. ఇందులో భవాని పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా సుస్వాగతంలో పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా, అంజలి సినిమాలో చిన్న పాప తండ్రిగా ఆయన నటించిన తీరు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. రజనీకాంత్‌కు రఘువరన్ మంచి స్నేహితుడు. బాషా చిత్రంలో ఆంటోనీ పాత్ర, ముత్తు, అరుణాచలం వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను బాగా నచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో ఆయన అభినయం అందరినీ అలరించింది. ఒకే ఒక్కడు చిత్రంలో ముఖ్యమంత్రిగా తన వయసుకు మించిన పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని మంత్రుల మేనరిజమ్స్‌ను పరిశీలించి పోషించారు. వ్యక్తిగత జీవితంలో మొదట్లో చెడు అలవాట్లు ఉన్నప్పటికీ, ఆయన వాటిని మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. నటి రోహిణితో 1996 ఆగస్టు 23న తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. రఘువరన్ మళ్ళీ మద్యానికి బానిస కావడం దీనికి కారణమని అంటారు. ఇదే విషయంపై అప్పట్లో ఆయన తమ్ముడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన అన్న మానసికంగాను, శారీరకంగాను బాగా అలసిపోయి చనిపోయినట్లు తెలిపారు. శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకువచ్చిన అవకాశం ఉండేదని, ఆదివారం తిరిగి వాళ్ళు తీసుకుపోతారని వెల్లడించారు. అది కోర్టు నిబంధన. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్లిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడని రఘువరన్ తమ్ముడు స్పష్టం చేశారు. దాంతో మద్యానికి మరింత బానిస అయినట్లు వెల్లడించారు. విడాకుల అనంతరం ఆయన కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందారు. 2008 మార్చి 19న రఘువరన్ 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us