ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు
ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన వారిలో చరణ్ రాజ్ ఒకరు. ఈ విలన్ తనదైన విలనిజంతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపించిన చరణ్ రాజ్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు.

ప్రముఖ నటుడు చరణ్ రాజ్ గుర్తున్నాడా.? ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి భయపెట్టాడు ఆ నటుడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. సూపర్ హిట్ సినిమాల్లో తన విలనిజంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న చరణ్ రాజ్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. చరణ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని, ఆర్థిక వ్యూహాలను, కెరీర్‌లోని మరపురాని క్షణాలను పంచుకున్నారు. ఆయన ముఖ్యంగా తన ఆర్థిక క్రమశిక్షణ, భూమిపై చేసిన తెలివైన పెట్టుబడుల గురించి వివరించారు. అప్పట్లో బెంగుళూరు, బెల్గాం వంటి నగరాల శివార్లలో ఎకరం భూమిని కేవలం రూ. 100 నుండి రూ. 500కు కొనుగోలు చేశానని చరణ్ రాజ్ వెల్లడించారు తెలిపారు. ఈ భూములు ఇప్పుడు రూ. 100 కోట్లకు పైగా విలువకు చేరుకున్నాయని, ఇది తన ఆర్థిక స్థితికి బలాన్ని చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.
భూమిపై చేసిన పెట్టుబడులు ఎల్లప్పుడూ లాభదాయకంగా ఉంటాయని, వీటి విలువ కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుందని అన్నారు. చరణ్ రాజ్ తన జీవితంలో డబ్బును వృథా చేయకుండా, ఆస్తులలో పెట్టుబడి పెట్టానని తెలిపారు. వ్యాపార విషయాలకు వస్తే, చరణ్ రాజ్ తండ్రి టింబర్ వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోందని, దానిని తన చిన్న తమ్ముడు చూసుకుంటున్నారని వెల్లడించారు. తన సినీ స్టార్‌డమ్ కారణంగా ఆ వ్యాపారానికి మరింత గుర్తింపు వచ్చిందని, కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా వ్యాపారంలో మంచి పేరు సంపాదించగలిగానని ఆయన పేర్కొన్నారు.
తన సినీ కెరీర్‌లో అత్యుత్తమ ఘట్టం గురించి మాట్లాడుతూ, దర్శకుడు టి. కృష్ణ రూపొందించిన ప్రతిఘటన చిత్రానికి నంది అవార్డు పొందడాన్ని చరణ్ రాజ్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చింది. ఆ అవార్డు అందుకున్న సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన పంచుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి, గొప్ప నటుడు ఎన్టీ రామారావు ప్రతిఘటన సినిమాను రెండుసార్లు చూశారని, తన నటనను ఎంతగానో ప్రశంసించారని తెలిపారు. అవార్డు ప్రదానోత్సవంలో గడ్డం, మీసం లేకుండా తెల్ల దుస్తులలో వేదికపై ఉన్న తనను చూసి, ఎన్టీఆర్ గారు “ఆయన ఎవరు? చరణ్ రాజ్ కొడుకా?” అని అడిగారట. రామోజీ రావు గారు ఈ విషయాన్ని తనకు తెలియజేశారని చరణ్ రాజ్ తెలిపారు. ఈ సంఘటన తన జీవితంలో, కెరీర్‌లో మరపురాని, గర్వించదగ్గ క్షణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




