AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత ఇంటిని తాకట్టు పెట్టి సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ షేక్.. ఇప్పటికీ అదే రికార్డ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సూపర్‌స్టార్ కృష్ణ చేసిన సేవలు అపారమైనవి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సినీరంగానికి ఎనలేని మేలు చేశారు. పరిశ్రమ స్థాయిని పెంచిన నటులలో ఆయన ఒకరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సినిమాలు పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డాయి.

సొంత ఇంటిని తాకట్టు పెట్టి సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ షేక్.. ఇప్పటికీ అదే రికార్డ్
Krishna
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 12:08 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులు అడుగుపెట్టారు. కృష్ణ, శోభన్ బాబు తమదైన శైలితో అగ్రతారలుగా ఎదిగారు. కృష్ణ తన సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. యాక్షన్, కౌబాయ్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలతో పాటు కలర్ స్క్రీన్, ప్రత్యేక సౌండ్ ఎఫెక్ట్స్ వంటి కొత్త టెక్నాలజీలను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్.ల హవా కొనసాగుతున్న రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి రంగ ప్రవేశంతో తెలుగు సినిమా ముఖచిత్రం మారింది. చిరంజీవి తన డ్యాన్స్‌ను నమ్ముకుని, అప్పటివరకు టాలీవుడ్‌లో ఎవరూ చూడని మైకెల్ జాక్సన్ తరహా డాన్స్ స్టైల్ ను పరిచయం చేశారు. ఆయన డ్యాన్స్ మూమెంట్స్, మెగా ఇమేజ్‌ను పెంచిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చిరంజీవి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఖైదీ సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. ఈ సినిమా విజయం అప్పటివరకు అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న కృష్ణ, శోభన్ బాబులలో ఒక రకమైన ఆందోళనను రేకెత్తించింది. ఖైదీ విజయంతో కృష్ణ ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కృష్ణ, తిరిగి ఫామ్‌లోకి రావడానికి, చిరంజీవి ప్రభంజనాన్ని తట్టుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారట. అదే సింహాసనం సినిమా. కృష్ణ ఈ సినిమా కోసం భారీ సాహసం చేశారు. తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి బడ్జెట్‌ను సమకూర్చుకున్నారు.

అంతేకాకుండా, ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించారు. ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి ప్రభావం నుంచి నిలబడాలని ఆయన చేసిన ప్రయత్నం వృథా పోలేదు. సింహాసనం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయం ఎంత గొప్పదంటే, బెజవాడ వంటి ప్రాంతాలలో సినిమా చూడటానికి వచ్చిన జనాలను నియంత్రించడానికి పోలీసులు 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింహాసనం విజయంతో సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందారు. ఈ సినిమా ప్రభావంతో కృష్ణకు మరో పదేళ్లపాటు తెలుగు సినిమాలో తిరుగు లేకుండా పోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us