AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. చేసిన ఒకే ఒక్క సినిమా ఫ్లాప్..

సాధారణంగా తెలుగు సినీరంగంలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు…పోతుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్ సంపాదించుకుంటారు. అలాగే పలువురు హీరోయిన్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరంటే..

చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. చేసిన ఒకే ఒక్క సినిమా ఫ్లాప్..
Actress Pic
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 10:37 AM

Share

సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ముఖ్యం.. అందం, అభినయం ఉన్న లక్ లేకపోతే సినిమాల్లో రాణించడం కష్టమే.. చాలా మంది హీరోయిన్ ఇలా లక్ కలిసి రాక దూరమైన వారు ఉన్నారు. కొన్ని సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా అట్టర్ ఫ్లాప్. కానీ ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఒక్క సినిమాతోనే కనిపించకండా మాయమైన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న చిన్నది ఎవరో తెలుసా.?

పై ఫొటోలో క్యూట్ గా ముద్దుగా ఉన్న ఈ పాపను చూశారా.? ఈమె ఓ క్రేజీ హీరోయిన్.. ఈ అందాల భామ తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత కూడా. ఇక ఈమె నానమ్మ అయితే హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసింది. ఇంత పెద్ద సినీ నేపథ్యం ఉన్నా సొంత ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకుందీ అందాల తార. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది.

మొదట కొన్ని సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా అలరించింది. సూర్య, శింబు, ఆర్య, పునీత్ రాజ్ కుమార్, జయం రవి, కార్తీ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇదే సమయంలో తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో అతనితో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే గతంలో మాదిరిగా సినిమాల్లో నటించడం లేదీ అందాల తార. ఆమె మరెవరో కాదుక్రేజీ బ్యూటీ సయేషా సైగల్. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, నటి సైరా బాను ల మనవరాలైన సయేషా గజినీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఇదే సమయంలో తన తోటి హీరో ఆర్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇరు పెద్దల అంగీకారంతో 2019లో పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక ముద్దుల కూతురు ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us