AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దపల్లి కోర్టు PPకి షాక్.. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!

పెద్దపల్లి జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న డొంకెన రవీందర్‌కు ఏసీబీ అధికారులు షాకిచ్చారు. ఒక కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి, రూ.1.5 లక్షలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో పీపీతో పాటు ఆయన సహాయకుడిని కూడా అరెస్టు చేశారు. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకోండి..

పెద్దపల్లి కోర్టు PPకి షాక్.. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
ACB Arrests Peddapalli Public Prosecutor
Srilakshmi C
|

Updated on: Nov 20, 2026 | 8:33 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 20: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో లంచగొండి అధికారిని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ టెన్యూర్)గా వ్యవహరిస్తున్న డొంకెన రవీందర్ రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో 2023లో భూ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పెద్దపల్లి జిల్లా కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విచారణ ప్రక్రియలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పీపీ లంచం డిమాండ్ చేయడంతో బాధిత నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అధికారులు సూచించిన విధంగా రూ.1.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం బుధవారం ఉదయం పెద్దపల్లిలోని పీపీ నివాసానికి వెళ్లి నగదును అందజేశారు.

ఇవి కూడా చదవండి

అప్పటికే అక్కడ మాటు వేసిన కరీంనగర్ ఏసీబీ అధికారులు నగదు తీసుకుంటున్న సమయంలో పీపీ రవీందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్‌తో పాటు ఆయనకు సహాయకుడిగా వ్యవహరించిన రెడ్డిరాజుల రాజయ్యను కూడా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. లంచం తీసుకుంటూ న్యాయస్థానంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us
రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
15 ఏళ్ల వైభవ్‌పై అందరి చూపు.. అభిషేక్‌తో కలిసి చెలరేగుతాడా?
15 ఏళ్ల వైభవ్‌పై అందరి చూపు.. అభిషేక్‌తో కలిసి చెలరేగుతాడా?
మా వాళ్లు మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!
మా వాళ్లు మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!
ఇన్సూరెన్స్ లేకపోతే టోల్ ప్లాజాల వద్ద చలాన్లు వేస్తారా?
ఇన్సూరెన్స్ లేకపోతే టోల్ ప్లాజాల వద్ద చలాన్లు వేస్తారా?
నెటిజన్‌కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్
నెటిజన్‌కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్
రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులోకి..
రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులోకి..
భారతీయులకు షాక్.. మలేషియా వెళ్లాలంటే వీసా తప్పనిసరి..
భారతీయులకు షాక్.. మలేషియా వెళ్లాలంటే వీసా తప్పనిసరి..
వాహనాలు ఆగాల్సిందే.. పాములు వెళ్లాల్సిందే! ఇదో వింత రోడ్డు!
వాహనాలు ఆగాల్సిందే.. పాములు వెళ్లాల్సిందే! ఇదో వింత రోడ్డు!
బంగ్లాదేశ్‌పై గెలుపుతో సౌతాఫ్రికా కెప్టెన్ ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌పై గెలుపుతో సౌతాఫ్రికా కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్
ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్