AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొని మంటల్లో కాలి బూడిదైన కారు!

హైదరాబాద్ మహానగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు అగ్నిప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట ఓఆర్‌ఆర్‌పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కోకాపేట వైపు వెళ్తున్న ఓ కారు.. మార్గమధ్యలో ఎదురుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొని మంటల్లో కాలి బూడిదైన కారు!
Orr Car Catches Fire
Balaraju Goud
|

Updated on: Nov 20, 2026 | 7:19 AM

Share

హైదరాబాద్ మహానగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు అగ్నిప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట ఓఆర్‌ఆర్‌పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కోకాపేట వైపు వెళ్తున్న ఓ కారు.. మార్గమధ్యలో ఎదురుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారు లారీని ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో కొద్దిసేపు అక్కడ భయానక వాతావరణం నెలకొంది. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంతో కారు పూర్తిగా కాలిపోవడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం కారణంగా ఓఆర్‌ఆర్‌పై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అసలు కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టిందా? లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. కారు మంటల్లో చిక్కుకోవడానికి గల కారణాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us