AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే ధర, ఫీచర్లు, స్పెషాలిటీస్​తో Honda Rebel 500.. కొత్త బైక్​ ధర ఎన్ని లక్షలు తెలుసా?

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ Honda భారత మార్కెట్లోకి కొత్త క్రూయిజర్ బైక్‌ను తీసుకొచ్చింది. తన పాపులర్ మోడల్ Rebel 500ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్ ధరను రూ.4.50 లక్షలుగా, E-Clutch వేరియంట్ ధరను రూ.4.90 లక్షలుగా నిర్ణయించింది. గతంలో CBU మార్గంలో దిగుమతి చేసుకుని విక్రయించిన ఈ బైక్‌ను ఇప్పుడు స్థానికంగా అసెంబుల్ చేస్తుండటంతో ధర తగ్గింది. క్లాసిక్ క్రూయిజర్ లుక్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ కోరుకునేవారిని ఈ బైక్ ఆకట్టుకునేలా ఉంది.

అదిరిపోయే ధర, ఫీచర్లు, స్పెషాలిటీస్​తో Honda Rebel 500.. కొత్త బైక్​ ధర ఎన్ని లక్షలు తెలుసా?
Honda Rebel 500
Nikhil
|

Updated on: Nov 20, 2026 | 6:50 AM

Share

Honda Rebel 500 బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బైక్ విక్రయాలు Honda BigWing డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే జరగనున్నాయి. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్‌, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో తీసుకొచ్చిన E-Clutch టెక్నాలజీ ఈ మోడల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

E-Clutch టెక్నాలజీ ప్రత్యేకత

Honda Rebel 500లో 471cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,500 RPM వద్ద 46 HP పవర్‌, 6,000 RPM వద్ద 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగర ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు.

E-Clutch వేరియంట్‌లో క్లచ్ లివర్‌ను ఉపయోగించకుండానే బైక్‌ను స్టార్ట్ చేయడం, ఆపడం, గేర్లు మార్చడం సాధ్యమవుతుంది. అవసరమైతే సాధారణ బైక్‌ల మాదిరిగానే క్లచ్ లివర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ కోసం అదనంగా రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది.

TFT డిస్‌ప్లే

ఫీచర్ల విషయానికి వస్తే కొత్త Rebel 500లో 3.5 అంగుళాల రౌండ్ TFT డిస్‌ప్లేను అందించారు. Honda RoadSync కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌, Honda Selectable Torque Control (ట్రాక్షన్ కంట్రోల్) కూడా అందించారు. 690 మి.మీ. సీట్ హైట్ ఉండటంతో తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా బైక్‌పై కూర్చోవచ్చు. దీని బరువు 191 కిలోలు కాగా, 16 అంగుళాల వీల్స్‌ను ఏర్పాటు చేశారు.

ధర విషయానికి వస్తే గతంలో Honda Rebel 500ను రూ.5.12 లక్షలకు విక్రయించింది. ఇప్పుడు సుమారు 50 శాతం స్థానికంగా తయారు చేయడంతో ప్రారంభ ధర రూ.4.50 లక్షలకు తగ్గింది. గత ధరతో పోలిస్తే సుమారు రూ.62,000 వరకు తగ్గింపు కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.4.01 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న Royal Enfield Shotgun 650కు Rebel 500 పోటీగా నిలవనుంది. భవిష్యత్తులో ఇంజిన్‌ను కూడా స్థానికంగా తయారు చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.

Follow Us