AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart Offers: ఇక పండగే.. పండగ.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!

DMart Offers: రాఖీ పండగ సందర్భంగా డీమార్ట్‌లో వినియోగదారుల తాకిడి మరింతగా ఎక్కువైపోయింది. డిమార్ట్‌లో సంప్రదాయ రాఖీలతో పాటు ఆధునిక డిజైన్లలోనూ అనేక రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల కోసం సూపర్ హీరోలు, కార్టూన్ పాత్రల డిజైన్లతో ప్రత్యేక రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. మహిళల కోసం..

DMart Offers: ఇక పండగే.. పండగ.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!
Dmart
Subhash Goud
|

Updated on: Aug 12, 2026 | 3:04 PM

Share

DMart Offers: డీమార్ట్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తక్కువ ధరల్లో లభించే వస్తువులు. ఇతర సూపర్‌ మార్కెట్ల కంటే డీమార్ట్‌లో భారీగా ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే రక్షాబంధన్ పండుగ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా డిమార్ట్ స్టోర్లలో పండుగ సందడి నెలకొంది. ఆగస్టు ప్రారంభం నుంచే రాఖీ షాపింగ్ కోసం వినియోగదారులు స్టోర్లకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు రాఖీ పండుగకు అవసరమైన వస్తువులు కూడా ఒకే చోట అందుబాటులో ఉండటంతో డిమార్ట్‌లో కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.

రాఖీలపై భారీ తగ్గింపులు:

రక్షాబంధన్ సందర్భంగా డిమార్ట్‌లో పలు ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది డీమార్ట్‌. కొన్ని రకాల రాఖీలు, స్వీట్లపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన బ్రాండెడ్ చాక్లెట్లపై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నారు. దీంతో పండుగ షాపింగ్‌కు డిమార్ట్‌ను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

రాఖీ పండగ సందర్భంగా డీమార్ట్‌లో వినియోగదారుల తాకిడి మరింతగా ఎక్కువైపోయింది. డిమార్ట్‌లో సంప్రదాయ రాఖీలతో పాటు ఆధునిక డిజైన్లలోనూ అనేక రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల కోసం సూపర్ హీరోలు, కార్టూన్ పాత్రల డిజైన్లతో ప్రత్యేక రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. మహిళల కోసం రాజస్థానీ శైలిలో రూపొందించిన లుంబా రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అన్ని ఒకే చోట..

రాఖీలతో పాటు గిఫ్ట్ ప్యాక్స్, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు వంటి పండుగకు అవసరమైన వస్తువులు కూడా ఒకే చోట లభిస్తున్నాయి. దీంతో వేర్వేరు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ సభ్యులు తమ పండుగ షాపింగ్‌ను ఒకే స్టోర్‌లో పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..!

Follow Us