AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Secret: ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..!

Investment Secret: సాధారణ ప్రజలు కూడా ఈ పెట్టుబడి మార్గాన్ని అనుసరించవచ్చు. ఎకరాలు కొనలేకపోయినా, చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, తమ పొదుపుతో చౌటుప్పల్, శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్ నగర్ వంటి శాటిలైట్ టౌన్స్ చుట్టూ చిన్న ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు. సరైన అనుమతులు ఉన్న ప్లాట్లకు బ్యాంకులు 50% వరకు రుణం కూడా అందిస్తాయి. ఇలాంటి పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రతను ఇస్తాయి..

Investment Secret: ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..!
Investment Secret
Subhash Goud
|

Updated on: Aug 10, 2026 | 8:15 PM

Share

Investment Secret: ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు, ధనవంతులు తమ సంపదను పెంపొందించుకోవడానికి వ్యాపారాల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రంగం స్థిరాస్తి. వారు దీర్ఘకాలిక విలువ పెంపు, అద్దె ఆదాయం కోసం ఆస్తులను కొనుగోలు చేయడంపై దృష్టి సారిస్తారు. ఇది కేవలం బాధ్యతలపై డబ్బు ఖర్చు చేయకుండా, భవిష్యత్తు కోసం ఆస్తులను సృష్టించే ఒక వ్యూహాత్మక మార్గం. ధనవంతులు ఎంత వీలైతే అంత భూములను, ముఖ్యంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేస్తారు. ఇందుకోసం వారు పూర్తిస్థాయి పరిశోధన చేసి, సరైన ప్రదేశాలను ఎంచుకుంటారు.

ఈ విధానానికి ఒక స్పష్టమైన ఉదాహరణ, ప్రముఖ నటుడు చిరంజీవి కోకాపేట పెట్టుబడి. చిరంజీవి స్వయంగా చెప్పిన దాని ప్రకారం, కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును కోకాపేటలో భూములపై పెట్టుబడిగా పెట్టారు. అప్పట్లో ఆ భూమిని కేవలం వ్యవసాయం చేసుకోవడానికో, ఫామ్ హౌస్ కట్టుకోవడానికో ఉద్దేశించి కొనుగోలు చేశారు. కానీ నేడు కోకాపేట ప్రాంతం హైదరాబాద్‌కు ఒక ఫ్యూచర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడంతో ఆ భూముల విలువ ఊహించని విధంగా పెరిగిపోయింది. ఒకప్పుడు పొలాలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరం విలువ ప్రస్తుతం కోట్లలో ఉంది. ఇది స్థిరాస్తి దీర్ఘకాలంలో ఎంతటి అపారమైన సంపదను సృష్టించగలదో తెలియజేస్తుంది. ఆ నటుడు ఇప్పుడు సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఈ భూముల రూపంలో కొండంత ఆర్థిక బలం లభించింది.

ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!

ఇవి కూడా చదవండి

సాధారణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం చేస్తూ కొంత పొదుపు ఉన్నవారు కూడా ధనవంతుల బాటలో నడవవచ్చు. పెద్ద ఎత్తున ఎకరాలు కొనలేకపోయినా, చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కల్పించుకోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల చౌటుప్పల్, శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్ నగర్ వంటి శాటిలైట్ టౌన్స్ లోని చిన్న ప్లాట్లు మంచి పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. పర్మిషన్లు అన్ని సక్రమంగా ఉన్న ప్లాట్లకు బ్యాంకులు 50 శాతం వరకు రుణం అందిస్తాయి. మిగిలిన 50 శాతాన్ని సొంతంగా భరించి, మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా తీసుకొని నెమ్మదిగా కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులు భవిష్యత్తులో గణనీయమైన విలువను పెంచుకొని ఆర్థిక భద్రతను చేకూరుస్తాయి.

ఇది కూడా చదవండి: Multibagger: రూ.71 స్టాక్ రూ.820కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!

భూములతో పాటు, ధనవంతులు వాణిజ్య భవనాల్లో కూడా పెట్టుబడి పెడతారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పెద్ద భవనాలను కొనుగోలు చేసి, అందులోని షాపులను పెద్ద బ్రాండ్లకు అద్దెకు ఇస్తారు. ఉదాహరణకు, ఒక భవనంలో పది షాపులు ఉండి, ఒక్కో షాపు నుంచి నెలకు లక్ష రూపాయల అద్దె వస్తే, మొత్తం నెలకు పది లక్షల రూపాయల అద్దె ఆదాయం వస్తుంది. ఇలాంటి అద్దె ఆదాయం స్థిరమైన పాసివ్ ఇన్కమ్ అందిస్తుంది. అద్దె ఆదాయంతో పాటు వాణిజ్య భవనాల భూమి విలువ కూడా కాలక్రమేణా పెరుగుతుంది. ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఆస్తుల విలువ నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అద్దె ఆదాయాన్ని కోరుకునే వారు ఒకే షాపును కూడా కొనుగోలు చేసి దాని ద్వారా వచ్చే అద్దెను పొందవచ్చు. స్థిరాస్తి పెట్టుబడులు దీర్ఘకాలిక సంపద సృష్టికి, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు