AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!

House Construction: ఇంటి నిర్మాణం అనేది ఒక పెద్ద ఆర్థిక ప్రక్రియ, దీనిలో ఒక్కో దశకు అయ్యే ఖర్చులు తరచుగా అంచనాలకు మించి ఉంటాయి. ఒక ఇంటిని బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించడానికి అయిన ఖర్చుల పూర్తి వివరాలు ఇక్కడ అందించాము. ఈ ధరలు ప్రాంతాలను బట్టి మారవచ్చని గుర్తించుకోండి. మీరు నాణ్యమైన మెటీరియల్‌ను ఉపయోగించి నిర్మాణం సాగిస్తే ఎంత ఖర్చవుతుందో చూద్దాం..

House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!
House Construction Up To Basement Level
Subhash Goud
|

Updated on: Aug 10, 2026 | 4:27 PM

Share

House Construction: ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల, అదే సమయంలో ఇది పెద్ద ఆర్థిక పెట్టుబడి కూడా. నిర్మాణ దశల వారీగా అయ్యే ఖర్చులను ముందుగానే అంచనా వేయడం కష్టతరం, తరచుగా వాస్తవ వ్యయాలు అంచనాలను మించిపోతాయి. ఈ కథనం ఒక ఇంటిని బోర్ వెల్ నుండి బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించడానికి అయిన ఖర్చుల పూర్తి వివరాలను అందిస్తున్నాము. ఇది భవిష్యత్తులో ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్న వారికి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఈ వివరాలు అన్ని కూడా ఇల్లు నిర్మించే బిల్డర్స్‌, మేస్త్రీలు, ఇంటి యజమాలను వివరాల ప్రకారం అందిస్తున్నాము. ఈ రోజుల్లో ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇందులో అందించిన ధరల వివరాలు ప్రాంతాలను బట్టి మారవచ్చని గమనించండి.

ప్రారంభ పనులు, మెటీరియల్స్ ఖర్చులు:

గత ఏడాది ఆగస్ట్‌ – సెప్టెంబర్‌ మాసంలో నిర్మాణం ప్రారంభించిన ఓ ఇంటి యజమాని వివరాల ప్రకారం.. నిర్మాణం మొదలుపెట్టడానికి ముందు ప్లాట్ క్లీనింగ్, మట్టి తవ్వకం, పిల్లర్ గుంతల తవ్వకం వంటి పనులకు జేసీబీని వినియోగిస్తుంటారు. దీనికి రూ. 10 వేలుపైనే, ఇంటికి నీటి సౌకర్యం కోసం బోరు వేయించడం, మోటారు, పైపులు, వైరుతో సహా మొత్తం సుమారుగా రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య. ఇక నిర్మాణ స్థలానికి కరెంటు సరఫరా కోసం సర్వీస్ వైరుకు సుమారు 5,000చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణానికి అవసరమైన కీలక మెటీరియల్స్ విషయానికి వస్తే, 30 టన్నుల కంకర కోసం రూ. 16,000కుపైనే. అలాగే, బేస్‌మెంట్ వరకు అవసరమైన ఇసుక, ఒక టిప్పరులో 26 టన్నులు, దీనికి రూ. 27,000 చెల్లించినట్లు ఆ ఇంటి యజమాని తెలిపారు. తాత్కాలిక అవసరాల కోసం కట్టెలు, ఒక తడక, ఒక నిచ్చెన కొనుగోలుకు దాదాపు రూ.4000 వరరు. పిల్లర్లు, అడ్డ భీములకు అవసరమైన ఐరన్, బేస్‌మెంట్ వరకు మొత్తం రూ. 80,000లకుపైనే ఖర్చయ్యింది. సిమెంట్ కోసం రూ. దాదాపు రూ.40,000. అలాగే నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే డ్రమ్ కొనుగోలుకు దాదాపు వెయ్యి రూపాయల వరకు ఖర్చు అయినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి?

ఇవి కూడా చదవండి

ఇతర కీలక మెటీరియల్స్ , పనుల ఖర్చులు:

40 ఎంఎం కంకర రెండు ట్రిప్పులు అవసరం. ఒక్కో ట్రాక్టర్ లోడుకు రూ. 4000, డ్రైవర్‌కు రూ. 100 బత్తాతో కలిపి మొత్తం రూ. 8,100 అయ్యింది. బేస్‌మెంట్ గోడల నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, 2,000 సంఖ్యలో రూ. 16,000 ఖర్చుతో కొనుగోలు చేశారు. బేస్‌మెంట్ కోసం రాయిని తెప్పించారు. ఏడు ట్రిప్పుల రాయికి రూ. 46,700 చెల్లించారు (ఒక్కో ట్రిప్పుకు రూ. 6,600, ఇందులో రాయికి రూ. 6,500, బత్తా రూ. 100). ఇంటి పునాది పనులకు రూ. 6,000లకుపైనే. ఇంటి అవసరాల కోసం రెండు సంపులను నిర్మించారు. వీటికి కలిపి రూ. 12,000 ఖర్చయ్యింది. స్థలాన్ని నింపడానికి మొరం (మురమ్) ఐదు ట్రిప్పులు తెప్పించారు. బత్తాలతో కలిపి దీనికి రూ. 18,000 వ్యయం అయ్యిందని తెలిపారు.

కూలీ, ఇతర ఖర్చులు:

పిల్లర్లు, అడ్డ భీములు పోయడానికి మిల్లర్ ఖర్చు సుమారు రూ. 8,000. మేస్త్రీకి ప్రారంభంలో రూ. 53,000. అయితే మొత్తం పని పూర్తయ్యాక ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మెటీరియల్స్ తరలించడానికి, మేస్త్రీని తీసుకురావడానికి అయిన ఆటో ఛార్జీలకు రూ. 4,000. అదనంగా, పారలు, గంపలు వంటి చిన్న చిన్న పనిముట్లకు, కొన్ని మర్చిపోయిన ఇతర చిన్న ఖర్చులకు కలిపి రూ. 3,000 అయ్యింది.

మొత్తం వ్యయం, అంచనాల వ్యత్యాసం:

మొత్తం మీద, 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షల నుంచి రూ.4 లక్షల 50 వేల వరకు అవుతుంది. మొదట ఇతరులను అడిగినప్పుడు బేస్‌మెంట్ వరకు రూ. 2 లక్షలు మాత్రమే అవుతుందని అంచనా వేసినప్పటికీ, వాస్తవ ఖర్చు దానికంటే రెట్టింపు అయ్యిందన్నారు. ఇంటి మొత్తం నిర్మాణానికి రూ. 10-12 లక్షలు అవుతుందని అంచనా వేయగా, ఈ బేస్‌మెంట్ ఖర్చుల తర్వాత రూ. 20 లక్షల వరకు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలు నిర్మాణ ఖర్చుల వాస్తవ స్థితిని స్పష్టం చేస్తాయి. అయితే ఈ ధరలు ప్రాంతాలను బట్టి తేడా ఉండవచ్చు. బేస్‌మెంట్ నిర్మాణానికి ఇంకా ఎక్కువ అవుతాయి తప్పా తక్కువే కాదని గుర్తించండి. అలాగే మీరు వాడే మెటీరియల్‌ లో క్వాలిటీ అయితేనే తక్కువ కావచ్చని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us