AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి?

House Construction: ఇంటి నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ అనేది ఒక అదనపు ఖర్చు కాకుండా, నిర్మాణం బలం, మన్నికకు అత్యవసరమైన పెట్టుబడి. పైన పేర్కొన్న విధంగా ప్రతి నిర్మాణ దశకు సరైన క్యూరింగ్ పీరియడ్ ను పాటిస్తే, మీ ఇల్లు అత్యంత బలంగా..

House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి?
House Construction
Subhash Goud
|

Updated on: Aug 08, 2026 | 7:57 AM

Share

House Construction: ఇంటి నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ అనేది ఒక ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన దశ. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా, నిర్మాణ పనులలో వాటర్ క్యూరింగ్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది నిర్మాణం బలం, మన్నిక, భవిష్యత్తులో వచ్చే పగుళ్లను నివారించడానికి అత్యవసరం. బ్రిక్ వర్క్, ఫుటింగ్స్, కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, ప్లాస్టరింగ్ వంటి ప్రతి దశకు సరైన క్యూరింగ్ పీరియడ్, పద్ధతులు పాటించాలి. ఈ వీడియో ద్వారా వాటర్ క్యూరింగ్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసి, స్పష్టమైన మార్గదర్శకాన్ని అందిస్తున్నాం.

బ్రిక్ వర్క్ క్యూరింగ్:

బ్రిక్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత కనీసం 7 నుండి 14 రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేయాలి. వారం రోజులు కచ్చితంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తడపడం వలన గోడలకు అవసరమైన తేమ లభించి బలంగా తయారవుతాయి. బ్రిక్ వర్క్ ఒకే రోజులో పూర్తి కానందున, కట్టిన వెంటనే ఫ్రెష్ గా ఉన్న గోడలను తడపకూడదు. ఈ రోజు కట్టిన బ్రిక్ వర్క్ ను రేపు ఉదయం తడపాలి. అదేవిధంగా నిన్న కట్టిన పనిని ఈరోజు తడపాలి. ఇలా చేయడం వలన పచ్చి గోడలపై నీరు పోసినప్పుడు అవి కదిలిపోయే అవకాశం ఉండదు. తద్వారా గోడ నిర్మాణం పటిష్టంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?

ఇవి కూడా చదవండి

పునాదుల క్యూరింగ్:

నిర్మాణానికి పునాది అయిన ఫుటింగ్స్ కు కనీసం 7 నుండి 10 రోజుల వరకు క్యూరింగ్ చేయాలి. ఇది పునాది కాంక్రీట్ ను బలోపేతం చేసి, భవనం బలానికి దోహదపడుతుంది.

పిల్లర్స్ క్యూరింగ్:

ఫుటింగ్స్ పైన మనం వేసుకునే కాలమ్స్, బీమ్స్ కు కూడా క్యూరింగ్ చాలా అవసరం. వీటికి 7 నుండి 14 రోజుల వరకు నీటితో తడపాలి. సరైన క్యూరింగ్ లేకపోతే కాంక్రీట్ బలహీనపడి, భవిష్యత్తులో నిర్మాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

స్లాబ్స్ క్యూరింగ్:

స్లాబ్స్ క్యూరింగ్ ఇంటి నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం. స్లాబ్ వేసిన తర్వాత కనీసం 14 రోజుల పాటు నిరంతరం క్యూరింగ్ చేయాలి. దీని కోసం స్లాబ్ పైన చిన్న కట్టలు కట్టి, అందులో నీటిని నింపి ఉంచాలి. నీరు తగ్గినప్పుడల్లా మళ్లీ నింపుతూ ఉండాలి. 14 రోజుల క్యూరింగ్ పీరియడ్ ను ఖచ్చితంగా పాటించడం వలన కాంక్రీట్ అత్యంత బలంగా తయారవుతుంది. ఇది భవిష్యత్తులో పగుళ్లు రాకుండా నిరోధించి, ఇంటికి దీర్ఘకాల స్థిరత్వాన్ని అందిస్తుంది.

ప్లాస్టరింగ్ క్యూరింగ్:

స్లాబ్స్, బ్రిక్ వర్క్ పూర్తయిన తర్వాత చేసే ప్లాస్టరింగ్ కు కూడా క్యూరింగ్ అవసరం. ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత కనీసం 10 రోజుల పాటు నీటితో తడపాలి. ఈ క్యూరింగ్ పీరియడ్ తర్వాతే పెయింట్స్, పుట్టీలు వంటి తదుపరి పనులకు వెళ్లాలి. సరైన ప్లాస్టరింగ్ క్యూరింగ్ గోడల ఉపరితలాన్ని బలోపేతం చేసి, పగుళ్లను నివారిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం.. ఇక కోనలేమా…?

ఇంటి నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ అనేది ఒక అదనపు ఖర్చు కాకుండా, నిర్మాణం బలం, మన్నికకు అత్యవసరమైన పెట్టుబడి. పైన పేర్కొన్న విధంగా ప్రతి నిర్మాణ దశకు సరైన క్యూరింగ్ పీరియడ్ ను పాటిస్తే, మీ ఇల్లు అత్యంత బలంగా, పగుళ్లు లేకుండా దీర్ఘకాలం మన్నికగా ఉంటుంది. వాటర్ క్యూరింగ్ ను ఎంత ఎక్కువగా చేస్తే, మీ ఇంటి నిర్మాణం అంత మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us