AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిజ్జా రౌండ్‌గా, ముక్కలు ట్రయాంగిల్‌గా, బాక్స్ స్క్వేర్‌గా.. దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే!

పిజ్జా.. ఈ పేరు చాలు ఎంతో మంది ఫాస్ట్ ఫుడ్ ప్రియులు తమ ఫేవరెట్ ఫుడ్ అని ఇట్టే చెప్పేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా దీనిని తింటూ ఉంటారు. అయితే పిజ్జాను ఎప్పుడూ గుండ్రంగానే (రౌండ్ షేప్) ఎందుకు తయారు చేస్తారు? దాన్ని చతురస్రాకారపు (స్క్వేర్) బాక్స్‌లోనే ఎందుకు ప్యాక్ చేస్తారు? తినేటప్పుడు త్రికోణాకారంలో (ట్రయాంగిల్) ఎందుకు కట్ చేస్తారు? అని ఆలోచించారా..?

పిజ్జా రౌండ్‌గా, ముక్కలు ట్రయాంగిల్‌గా, బాక్స్ స్క్వేర్‌గా.. దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే!
Pizza
Korivi Jayakumar
|

Updated on: Nov 19, 2026 | 10:57 AM

Share

పిజ్జా.. ఈ పేరు చాలు ఎంతో మంది ఫాస్ట్ ఫుడ్ ప్రియులు తమ ఫేవరెట్ ఫుడ్ అని ఇట్టే చెప్పేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా దీనిని తింటూ ఉంటారు. వెజ్ పిజ్జాలతో పోలిస్తే నాన్ వెజ్ పిజ్జాలకు మనకి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో పాటు చిన్న చిన్న చికెన్ ముక్కలు టాపింగ్‌ చేసే ఈ ఇటాలియన్‌ వంటకాన్ని ఒకసారి టేస్ట్ చేస్తే.. మళ్లీ మళ్లీ తినాలనిపించడం పక్కా అంటారు. అయితే పిజ్జాను ఎంతో ఇష్టపడేవారు కూడా ఈ సీక్రెట్ లాజిక్స్ గమనించి ఉండకపోవచ్చు.

మేకింగ్.. ప్యాకింగ్.. సర్వింగ్..

మీకు పిజ్జా బాగా ఇష్టమైన ఫుడ్ అయినా.. ఎప్పటి నుంచో తింటున్నా కానీ.. ఈ విషయాన్ని మాత్రం అంత బాగా పట్టించుకొని ఉండరేమో. అదే.. మేకింగ్.. ప్యాకింగ్.. సర్వింగ్. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. అసలు పిజ్జాను ఎప్పుడూ గుండ్రంగానే (రౌండ్ షేప్) ఎందుకు తయారు చేస్తారు? దాన్ని చతురస్రాకారపు (స్క్వేర్) బాక్స్‌లోనే ఎందుకు ప్యాక్ చేస్తారు? పైగా తినేటప్పుడు త్రికోణాకారంలో (ట్రయాంగిల్) ఎందుకు కట్ చేస్తారు? అని ఆలోచించారా. అయితే ఈ మూడు ఆకారాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

పిజ్జా గుండ్రంగానే ఎందుకు..?

ఈ ప్రశ్నకు సమాధానం మన ఇంట్లో చేసే చపాతీ లేదా రొట్టెల్లోనే ఉంది. సాధారణంగా రొట్టెలను గుండ్రంగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఏదైనా పదార్థం గుండ్రంగా ఉన్నప్పుడే, దానికి వేడి అన్ని వైపులా సమానంగా తగిలి బాగా ఉడుకుతుంది. పిజ్జా విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. పిజ్జా బేస్ గుండ్రంగా ఉండటం వల్ల ఓవెన్‌లో పెట్టినప్పుడు అది అన్ని వైపులా ఒకే విధంగా కాలి, చక్కగా ఉడుకుతుంది. ఒకవేళ పిజ్జా వేరే ఆకారంలో ఉంటే, ఒకవైపు ఎక్కువగా కాలిపోయి, మరోవైపు పచ్చిగా ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పిజ్జాను గుండ్రంగా తయారు చేస్తారు.

స్క్వేర్ బాక్స్..?

కాగా గుండ్రంగా ఉండే పిజ్జాను రౌండ్ బాక్స్‌లో కాకుండా చతురస్రాకారపు (స్క్వేర్) బాక్స్‌లో ఎందుకు పెడతారనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకు సంబంధించి మాత్రం రెండు కారణాలు ఉన్నాయని చెబుతుంటారు. అందులో ఒకటి తక్కువ ఖర్చు. ఉదాహరణకు చతురస్రాకారపు బాక్సులను కేవలం ఒకే కార్డ్‌బోర్డ్ షీట్‌తో తయారు చేయవచ్చు. కానీ రౌండ్ బాక్సుల తయారీకి మాత్రం ప్రత్యేక మెషీన్లు కావాలి. రెండిటి మధ్య ఖర్చు తేడాను చూస్తే రౌండ్ బాక్స్ కోసం వెచ్చించే ఖర్చు కూడా ఎక్కువేనని అందుకే ఈ రకంగా తయారు చేస్తారని వెల్లడిస్తున్నారు. ఇక షాపు షెల్ఫ్‌లలో.. డెలివరీ బ్యాగుల్లో.. ఇంట్లో ఫ్రిజ్‌లో పెట్టుకోవాలన్నా స్క్వేర్ బాక్సులు మూలల వరకు చక్కగా సరిపోతాయి. అదే రౌండ్ బాక్సులు అయితే మధ్యలో ఖాళీ స్థలం వృథా అవుతుందని రివీల్ చేశారు.

Pizza (1)

ట్రయాంగిల్ లోనే ఎందుకు కట్..?

ఇక పిజ్జాను ఎప్పుడూ త్రికోణం (ట్రయాంగిల్) ఆకారంలోనే ఎందుకు కట్ చేస్తారనే విషయానికి వస్తే అందుకు ఒక్కటే కారణం. సహజంగా గుండ్రంగా ఉన్న ఏ వస్తువునైనా అందరికీ సమానమైన భాగాలుగా పంచాలంటే, దాన్ని చిన్న చిన్న త్రికోణాలుగా (స్లైసులుగా) కట్ చేయడం ఒక్కటే సరైన మార్గం. అందుకే అదే పద్దతిని ఫాలో అవుతూ సర్వింగ్ చేస్తున్నారు.

Follow Us