చలికాలంలో జలుబు, దగ్గును తగ్గించే చిట్కాలు!

samatha

18 November 2026

Pic credit - Pinterest

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

దగ్గు జలుబు

ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతుంటారు.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు

కాగా, ఇప్పుడు మనం అసలు చలికాలంలో జలుబు, దగ్గు తగ్గిపోవాలి అంటే? ఎలాంటి చిట్కాలు పాటించాలో చూసేద్దాం.

చిట్కాలు

చలికాలంలో ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే గొంతులో మంట, జలుబు, దగ్గు త్వరగా తగ్గిపోతాయి.

గోరు వెచ్చని నీరు తేనె

అల్లం, తులసి ఆకులు, మిరియాలు వేసి మరిగించిన కషాయం రోజూ రెండుసార్లు తాగితే జలుబు దూరమై శరీరం వెచ్చగా ఉంటుంది.

అల్లం, తులసి ఆకుల రసం

వేడి పాలలో పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు బాగా తగ్గి నిద్ర బాగా పడుతుంది

వేడి పాలలో పసుపు

ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ, గొంతులో కఫం కరిగిపోయి శ్వాస తేలికగా ఆడుతుంది, తలనొప్పి తగ్గుతుంది.

ఆవిరి పట్టడం

వెల్లుల్లి రెండు రెబ్బలు వేడి అన్నంలో తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు త్వరగా తగ్గి మళ్ళీ రాదు.

రోగనిరోధక శక్తి