కేవలం నెలకు రూ.500 పొదుపు చేయండి.. రూ.50 లక్షలు మీ అకౌంట్లోకి..

Venkatrao Lella

Images: Pinterest

16 NOV 2026

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో కేవలం ప్రతీ నెలా రూ.500 పొదుపు చేస్తే చాలు.. మీరు రూ.50 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెట్టడం వల్ల ఇది సాధ్యమవుతుంది.

భారీగా రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీనెలా రూ.500 సిప్ రూపంలో జమ చేస్తూ ఉండాలి. ఇలా మీరు 39 సంవత్సరాలపాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి.  దీంతో 39 ఏళ్లకు మొత్తం రూ.2,34,000 అవుతుంది.

మీరు ప్రతీ ఏడాది 12 శాతం చొప్పున మీ పెట్టుబడిపై ఆదాయం పొందుతారు. ఇదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న మరో అద్బుతం ఏంటంటే.. చక్రవడ్డీ కూడా లభిస్తుంది. దీని వల్ల మీరు డబ్బులు రెట్టింపవుతాయి.

చక్రవడ్డీ వల్ల 39 ఏళ్లకు మీ పెట్టుబడి రూ.50 లక్షలకు చేరుతుంది. ఒకవేళ మీ ఫండ్ ఇంకా బాగా ఫర్ఫామ్ చేస్తే మరింత ఆదాయం మీ సొంతమవుతుంది. కాలవ్యవధి పెరిగే కొద్ది మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

చాలామంది స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు సిప్‌లను చెల్లించడం ఆపేసి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ పడిపోయినప్పుడు రూ.500తో మీరు ఎక్కువ యూనిట్లను పొందుతారు. దీన్నే రూపాయి కాస్ట్ యావరేజింగ్ అని పిలుస్తారు. మీరు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే మార్కెట్ ఎగబాకినప్పుడు మీకు భారీ లాభాలు వస్తాయి.

మార్కెట్ల కదలికల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీ పెట్టుబడులు కొనసాగించడం వల్ల లాభం ఉంటుంది. మధ్యలో వెనక్కి వెళ్లడం వల్ల లాభం కలగదు.

మ్యూచువల్ ఫండ్స్‌లో తక్కువ కాలంలో డబ్బులు పెరగడం అనేది జరగదు. ఎక్కువకాలం ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక లాభం ఉంటుంది. దీనిని ముందుగా గుర్తించుకుని సిప్‌ను స్టార్ట్ చేయాలి

ఎక్కువ సంవత్సరాలు కొనసాగించడం వల్ల మీరు పెట్టే తక్కువ పెట్టబడి ఎక్కువ అవుతుంది. చక్రవడ్డీ వల్ల భవిష్యత్తులో భారీగా పెరుగుతుంది.