రాఖీ పండగ
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పండగగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రాఖీ పండగ. కొని ఏళ్ల క్రితం వరకూ రాఖీ పండగను ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ ను జరుపుకుంటున్నారు. అమ్మలోని మొదటి అక్షరం అ ని.. నాన్నలోని రెండో అక్షరం న్న ని కలిపి దేవుడి ఇచ్చిన బంధమే అన్న… అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతను తీసుకునే అన్న జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సోదరమణి మణికట్టుకు కట్టే రక్ష. సోదరసోదరీమణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రాఖీ పండగ ఈ ఏడాది ఆగస్టు 19 వ తేదీ సోమవారం జరుపుకోనున్నారు. ఇప్పటికే మార్కెట్ లో రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. సోదరీ జీవితానికి ఎప్పుడూ రక్షగా ఉంటాను అని మాట ఇచ్చే రక్షా బంధన్ ను.. ఎప్పుడూ నీ రక్షణలో సోదరుడికి మాట రానీయక నడుస్తాను సోదరి మాట ఇచ్చే రోజు ఈ రక్షాబంధన్ జరుపుకోవడానికి కుల మతాలకు అతీతంగా సోదర సోదరీమణులు రెడీ అవుతున్నారు.