బాలీవుడ్ నాయిక దీపిక పదుకొనే హాలీవుడ్ సిరీస్ ది వైట్ లోటస్ నాలుగో సీజన్ ఆడిషన్స్ కు నిరాకరించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ మేకర్స్ ఆమెను సంప్రదించి, ఆడిషన్స్ కు రమ్మని కోరగా, ఆమె హాజరు కాలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, మేకర్స్ మరో నటి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.