Hyderabad: రాఖీ అనుబంధానికి కొత్త అర్థం చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. రాఖీలతో రోడ్లపైకి వచ్చి..
రాఖీ పండగ అనుబంధానికి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొత్త అర్థం చెప్పారు. రాఖీలతో రోడ్లపైకి వచ్చి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వాళ్లకు రాఖీ కట్టారు. రాఖీ కట్టడమే కాకుండా మీ ప్రాణం మాకు అమూల్యం.. అని చెబుతూ హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ ప్రధాని రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు మహిళలు రాఖీ కట్టారు. రాఖీ పండుగ అంటే సోదరసోదరీమణుల అనుబంధానికి చిహ్నం. అయితే రాఖీ పండుగ రోజు… రాచకొండ మహిళా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చారు. కానీ ఈసారి వారి చేతుల్లో చలాన్లకు బదులు.. ప్రేమ, ఆప్యాయతతో నిండిన రాఖీలు ఉన్నాయి. అవును హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న వారిని ఆపి వారు మందలించలేదు. బదులుగా.. రాఖీలు కట్టి.. ముద్దు చెల్లెల్లా ఒక సందేశం ఇచ్చారు.
రాఖీ పండగ అనుబంధానికి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొత్త అర్థం చెప్పారు. శనివారం, ఆగస్టు 9న.. కమిషనరేట్ పరిధిలోని మహిళా ట్రాఫిక్ పోలీసులు వీధుల్లోకి వచ్చి.. హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తున్నవారికి రాఖీలు కట్టారు. మీ ప్రాణం మాకు అమూల్యం.. అని చెబుతూ రాఖీ కడుతూ హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. రాఖీ ఎలా రక్షణ ఇస్తుందో, హెల్మెట్ కూడా అలాగే రక్షిస్తుందనే సందేశాన్ని జనాల్లోకి పంపారు. పండుగ సంతోషాన్ని సేఫ్టీ అవగాహనతో మిళితం చేసిన ఈ వినూత్న ప్రయత్నం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ పోలీసులు చేసిన పనిని చాలామంది నెటిజన్లు మెచ్చుకున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
