AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Bite: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

కుంకుడు చెట్టు వేరు పాము కాట్లకు అత్యవసర ప్రాథమిక చికిత్సగా ఉపయోగపడుతుంది. రెండు అంగుళాల వేరు తునకను నమలడం ద్వారా విషాన్ని బయటకు పంపవచ్చని, అల్లోపతి చికిత్సకు వెళ్లే ముందు ఇది ప్రాణాలను కాపాడుతుందని వైద్య నిపుణులు వివరించారు. ఆ వివరాలు ఇలా..

Snake Bite: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..
Lifestyle
Ravi Kiran
|

Updated on: Mar 14, 2026 | 7:14 PM

Share

కుంకుడు చెట్టు ప్రాచీన కాలం నుంచి వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. పూర్వ కాలంలో నల్లని, ఒత్తైన జుట్టు, చక్కటి కేశ సంపదకు కుంకుడుకాయలు ఒక ముఖ్య కారణంగా నిలిచాయని నిపుణులు అంటున్నారు. నేటి తరం షాంపూలు, సబ్బులకు బదులుగా కుంకుడుకాయలను ఉపయోగించడం ద్వారా చుండ్రు వంటి సమస్యలను నివారించవచ్చని.. తల, శరీరం శుభ్రతకు ఇవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. అంతేకాకుండా, నగల శుభ్రానికి కూడా కుంకుడుకాయలను ఉపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

అయితే, కుంకుడు చెట్టు అత్యంత అద్భుతమైన ప్రయోజనం పాము కాట్లకు అత్యవసర చికిత్సగా దీని వేరు ఉపయోగిస్తారన్నారు. మానవులను పాము లేదా తేలు లాంటి విషపు కీటకాలు కరిచినప్పుడు, సాధారణంగా ఆందోళనతో విలువైన సమయాన్ని కోల్పోతాము. ఇలాంటి పరిస్థితులలో, సంకోచం లేకుండా కుంకుడు చెట్టు వేరును ఉపయోగించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. పాము కాటుకు గురైన వ్యక్తికి, రెండు అంగుళాల కుంకుడు చెట్టు వేరు తునకను తీసుకొని, దవడ పక్కన ఉంచి నమలమని సూచించాలన్నారు. ఈ వేరులోని చేదు గుణం విషాన్ని బయటకు పంపే నురుగును ఉత్పత్తి చేస్తుందని, తద్వారా విష ప్రభావం తగ్గి, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా కోలుకుంటాడని ఆయన వివరించారు. ఈ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, అత్యవసరంగా అల్లోపతి వైద్య విధానం కోసం ఆసుపత్రికి తరలించాలి. చికిత్స పొందుతున్న సమయంలో కూడా కుంకుడు చెట్టు వేరును తినిపించడం ద్వారా త్వరితగతిన కోలుకోవడానికి సహాయపడుతుందని డాక్టర్లు చెప్పారు.

నాగుపాము, అత్యంత విషపూరితమైన పాము లేదా విషం లేని పాము ఏదైనా కరిచినా, ఈ కుంకుడు చెట్టు వేరు చికిత్స అన్ని రకాల విషపు కాట్లకు ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. గ్రామాలలో, పొలాలలో పనిచేసే ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కుంకుడు చెట్టును ప్రతి గ్రామంలో, ప్రతి పొలంలో పెంచాలని, తద్వారా విషపు కాట్ల నుంచి ప్రజలను కాపాడవచ్చునని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ప్రాణాలను కాపాడే చికిత్స మాత్రమే కాకుండా, అల్లోపతి వైద్య విధానంలో ఎదురయ్యే నరకయాతన నుంచి కూడా రక్షిస్తుందని ఆయన వివరించారు.

ఇది చదవండి: ఆపరేషన్ అక్కర్లేదు.. 15 రోజులు ఇలా చేస్తే పైల్స్ రోగం మళ్లీ రానే రాదు..

Disclaimer: ఈ కథనం కేవలం వీక్షకుల ఆసక్తి మేరకు ప్రచురించింది. టీవీ9 తెలుగు ఏవి ధృవీకరించలేదు. ఏదైనా పాము కరిచినప్పుడు తక్షణమే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడం ముఖ్యం. 

Follow Us