AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. నేటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు, సిరీస్ లు మాత్రం ఆడియెన్స్ ను ఆలోచనలో పడేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. నేటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 7:54 PM

Share

కొన్ని రోజుల క్రితం తమిళ్ లో విడుదలైన ఓ సినిమా ఆడియెన్స్ అందరినీ ఆలోచనలో పడేసింది. సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటలను ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొన్ని సీన్లు బోల్డ్ గా ఉన్నాయని, బూతులు ఎక్కువగా విమర్శలు వచ్చినా కంటెంట్ పరంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. గత నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో ప్రధానంగా మూడు సెగ్మెంట్లుగా విభజించారు. సమాజంలో ఉన్న కొన్ని సీరియస్, సెన్సిటివ్ అంశాలను చర్చించారు. టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ అంటే హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే స్వలింగ సంపర్కుల వివాహం చుట్టూ ఉన్న ప్రచారం.. మూడోది ఒక వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీ టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు హాట్ స్పాట్ టూ మచ్. గ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ బోల్డ్ మూవీలో ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్ అంటే తమిళ వెర్షన్ ఆరు ఓటీటీల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న హాట్ స్పాట్ టూ మచ్ తెలుగు వెర్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్..