AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే.. ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?

ఇండస్ట్రీలో సినిమాలు చేతులు మారడమనేది సహజం. ఒక హీరో లేదా హీరోయిన్ చేయాల్సిన సినిమా వేరే హీరో/ హీరోయిన్ దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుది. అలా లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేసిన ఒక సినిమా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దగ్గరకు వెళ్లింది.. కట్ చేస్తే..

లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే.. ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?
Lavanya Tripathi, Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Mar 12, 2026 | 8:24 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య త్రిపాఠి. వీరికి పండంటి బాబు జన్మించాడు. ప్రస్తుతం తన పిల్లాడి పెంపకంలో బిజీ బిజీగా ఉంటోన్న ఈ మెగా కోడలు గతంలోలా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అడపా దడపా మాత్రమే మూవీస్ చేస్తోంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మొదటి సినిమా సతీలీలావతి ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 06నే విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో లావణ్య కూడా చురుగ్గా పాల్గొంటోంది. ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ నుంచి లావణ్యకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.’ ఏదైనా సినిమాలను రిజెక్ట్ చేసి రిగ్రేట్ గా ఫీల్ అయ్యారా? అనే ప్రశ్నకు లావణ్య ఇలా ఆన్సర్ ఇచ్చింది.

‘ఇప్పటివరకు నేను సినిమాలను పెద్దగా రిజెక్ట్ చేయలేదని అలాగే సినిమాల విషయంలో ఎలాంటి రీ గ్రేట్ కూడా లేదు. కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకు ముందు నో చెప్పాను కానీ తర్వాత ఎస్ చెప్పినప్పటికీ ఆ సినిమా ఛాన్స్ కోల్పోయాను. ఆ సినిమాలో రష్మిక నటించి సూపర్ సక్సెస్ అందుకుంది. నేను ఈ సినిమా కథ వినకముందు నో అని చెప్పాను. కానీ కథ విన్న తర్వాత సినిమాను నటించేందుకు ఓకే చెప్పాను. ఈ సినిమా విషయంలో ఏదేదో జరిగి చివరికి రష్మిక వద్దకు వెళ్లింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు’ అంటూ విజయ్ దేవరకొండ- రష్మికలకు అభినందనలు తెలిపింది లావణ్య.

ఇవి కూడా చదవండి

ఈపాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. లావణ్య త్రిపాఠి వద్దనుకున్న సినిమా ఏదో.. యస్. ఆ మూవీ మరేదో కాదు గీత గోవిందం. ప్రస్తుతం లావణ్య కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

భర్త, కుమారుడితో లావణ్య త్రిపాఠి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!