AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇప్పుడు గుడిలో పెళ్లి.. అసలు మోనాలిసా లైఫ్‌లో ఏం జరుగుతోంది? వీడియో

ఇవాళ (మార్చి 11) మధ్యాహ్నం నుంచి మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ప్రస్తుతం సినిమాలు, యాడ్స్ తో బిజీగా ఉంటోన్న ఆమె సడెన్ గా ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా..

Monalisa: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇప్పుడు గుడిలో పెళ్లి.. అసలు మోనాలిసా లైఫ్‌లో ఏం జరుగుతోంది? వీడియో
Mahakumbh Viral Beauty Monalisa Bhonsle
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 8:00 PM

Share

గతేడాది ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మహా కుంభ మేళాలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే పెళ్లీపీటలెక్కింది. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. బుధవారం (మార్చి 11) కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రులు, సీపీఎం నాయకులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోనాలిసా పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలు, యాడ్స్ తో బిజీగా ఉన్న మోనాలిసా సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌ ఫేస్‌ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.   అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరిరి వేర్వేరు మతాలు కావడంతో మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఈ పెళ్లిని  వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ కోసం కేరళకు వచ్చింది మోనాలిసా. తండ్రి కూడా అక్కడికి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఈ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది.  తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులొ పేర్కొంది.

మోనాలిసా పెళ్లి వీడియోలు ఇవిగో

పోలీసుల సమక్షంలో..

కాగా తాను మేజర్‌ని అని..ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మోసాలిసా పోలీసులకు తెలిపింది. దీంతో స్పందించిన పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. అయితే ఉన్నట్లుండి మోనాలిసా పోలీసుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె  పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us