AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పచ్చి బూతులు.. ఏరులై పారే నెత్తురు.. ఓటీటీలో వణుకు పుట్టించే బోల్డ్ క్రైమ్ సిరీస్.. పిల్లలతో చూడొద్దు

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. అయితే కేవలం హిందీ, మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

OTT Movie: పచ్చి బూతులు.. ఏరులై పారే నెత్తురు.. ఓటీటీలో వణుకు పుట్టించే బోల్డ్ క్రైమ్ సిరీస్.. పిల్లలతో చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 9:01 PM

Share

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే ఇప్పటి ఆడియెన్స్ ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లనే ఎక్కువగా చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఆయా భాషల్లోని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. కేవలం హిందీ, తమిళం, మలయాళంలోనే కాదు తెలుగులోనూ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్. సాధారణంగా తెలుగులో రానా నాయుడు సిరీస్ ను బోల్డ్ అని చెబుతారు. అయితే ఇది అంతకు మించి అని చెప్పవచ్చు. మదనపల్లె నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పచ్చి బూతులు వినిపిస్తాయి. రక్తం ఏరులై పారుతుంటుంది. ఒళ్లు జలదరించే కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ ను ఓటీటీ ఆడియెన్స్ బాగానే ఆదరించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. మదనపల్లె దగ్గర ఒక ఊర్లో సావిత్రి అనే ఒక ఒంటరి మహిళ ఉంటుంది. మొగుడు లేకపోయినా, తన ముగ్గురు పిల్లల్ని కష్టపడి పెంచుతుంది. అయితే ఆ ఊరిలో ఉండే ఒక పోలీస్ సావిత్రితో పాటు ఆమె కూతురుపై కన్నేస్తాడు. పోలీసోడు పెట్టే నరకం చూడలేక ఒకరోజు వాడిని సావిత్రి ఆమె పెద్ద కొడుకు గొడ్డలితో నరికి చంపేస్తాడు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది.

ఊర్లో ఉండే అరాచక శక్తులన్నింటినీ అణచివేస్తాడు సావిత్రి పెద్ద కొడుకు. ఈ క్రమంలోనే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోతాడు. అంతేకాదు సావిత్ర కుమారుడు అడవిలో ఉండే నక్సలైట్లతో కలిసి ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగుతాడు. ఎదురుగా ఎవరొచ్చినా నరుక్కుంటూ పోవడమే అతని పని. మరి చివరకు సావిత్రి ఆమె ఫ్యామిలీ ఏమైంది? కొడుకు ఏమైపోయాడు? అన్నది తెలుసుకోవాలంటే షైతాన్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ మూడేళ్ల క్రితం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిషి, షెల్లీ కిషోర్ , దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, రవి కాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. పచ్చి బూతులు, జుగుప్పాకరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలతో చూడకపోవడేమే ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us