AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ గా చేశారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, పండించిన కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ బిగ్ బాస్ జోడీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేశారు.

Trending Song: యూట్యూబ్‌ను  ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..
Rithu Chowdary Demon Pawan Bangaram Song
Basha Shek
|

Updated on: Aug 06, 2026 | 9:57 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో జంటగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ సాంగ్ లో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో మెలోడీ లిరిక్స్, సాంగ్ విజువల్స్, ఇద్దరీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. బంగారం పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు అతనే స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. అలాగే మరో స్టార్ సింగర్ సమీరా భరద్వాజ్ వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా రంజిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్‌గా నిలిచిందని చెప్పవచ్చు.

మెలోడీ, బీట్‌లు, అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి ‘బంగారం’ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. ఈ బంగారం పాటకు డైరెక్టర్, కొరియోగ్రాఫర్ విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ.. ‘డెమాన్ పవన్, రీతూ చౌదరి సహా మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు పాటను ఆదరిస్తుండటం సంతోషంగా ఉందని, ఈ ఆదరణతో పాట మరింత పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే క్రమంలో డీమాన్ పవన్ మాట్లాడుతూ.. ‘ డీపీ క్రియేషన్స్ బ్యానర్‌ను మరింత ముదుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ సాంగ్ ను విడుదల చేశాం. భవిష్యత్తులో ఇదే బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పెద్ద తెర చిత్రాలను కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది. ఈ పాటలో రీతూ చౌదరి తనకు ఎంతో సహకరించింది. షూటింగ్ సమయంలో మంచి స్నేహితులమయ్యాం. నాగార్జున పాటను లాంచ్ చేసి ప్రశంసించడం, ఉప్పలపాటి శ్యామలాదేవి ప్రోమోను విడుదల చేసి ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

 రీతూ చౌదరీ, డీమాన్ పవన్ ల రొమాంటిక్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..