AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 06, 2026 | 10:00 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం దాదాపు 25కు పైగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో అఖిల్ అక్కినేని లెనిన్, సుకుమారి, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందు ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన మొదటి సినిమా ‘లవ్‌ ఓ లవ్‌’. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ మేనల్లుడు  పవీస్‌ నారాయణన్‌ హీరోగా నటించాడు. అలాగే  సెల్వరాఘవన్‌, వనితా విజయ్‌ కుమార్‌, కేఎస్‌ రవికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 10న థియేటర్లలో విడుదలైంది. జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. యూత్ మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసిన నాగదుర్గ సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో దూసుకుపోతోంది. బహుశా నాగదుర్గ క్రేజ్‌ దీనికి కారణమని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం అమెజాన్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే.. రెండో స్థానంలో హాలీవుడ్‌ మూవీ ‘ది డెవిల్స్ మౌత్‌’ ఇండియాలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మూడో స్థానంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర ల పోలీస్ కంప్లైంట్ సినిమా ఉంది. ఇక నాలుగో స్థానంలో నాగబంధం, ఐదో ప్లేస్ లో `మాస్టర్స్ ఆఫ్‌ ది యూనివర్స్` అనే హాలీవుడ్‌ చిత్రం రన్ అవుతోంది. ఇక ఆరో స్థానంలో సాయిపల్లవి ఏక్ దిన్ సినిమా, ఏడో ప్లేస్ లో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ `అనోమీ`, ఎనిమిదో ర్యాంక్ లో కన్నడ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌’, తొమ్మిదో స్థానంలో ‘ఘోస్ట్ ట్రైన్‌’, పదో స్థానంలో `స్పైడర్‌ మ్యాన్‌ హోమ్ కమింగ్‌` సినిమాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ 10 నిమిషాల సీన్ తీయకపోయి ఉంటే జయం మనదేరా ప్లాప్ అయ్యేది..
ఆ 10 నిమిషాల సీన్ తీయకపోయి ఉంటే జయం మనదేరా ప్లాప్ అయ్యేది..
నానక్‌రామ్‌గూడలో తీవ్ర విషాదం.. బతుకుదెరువు కోసం వచ్చి..
నానక్‌రామ్‌గూడలో తీవ్ర విషాదం.. బతుకుదెరువు కోసం వచ్చి..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఫ్రెష్ చేపలను గుర్తించడం ఇంత ఈజీనా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
ఆ సినిమా మొత్తం నైటీలోనే చేశా..
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు!
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
మహిళలు ముక్కుకు ఎడమ వైపునే ముక్కుపుడక ఎందుకు ధరిస్తారు?
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితం ఆయన చెప్పిందే నిజమైంది.. వీడియో
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే