AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ అకాల మరణం అందరినీ కలిచి వేసింది. తెలుగుతో సహా ఎన్నో భాషల్లో వందల సినిమాలు చేసిన ఈ నటుడు హఠాన్మరణం చెందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేమికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Pradeep Rawat: నటుడు ప్రదీప్ రావత్ భార్య మన తెలుగమ్మాయేనని తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో
Pradeep Rawat
Basha Shek
|

Updated on: Aug 04, 2026 | 10:29 PM

Share

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) హఠాన్మరణం చెందారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న రావత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 04) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985 నుంచి యాక్టింగ్ మొదలు పెట్టారు. సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహా భారత్ టీవీ సిరీస్ లో రావత్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆమిర్ ఖాన్ నటించిన క్ బస్టర్ మూవీ లగాన్ లోనూ ఓ కీలక పాత్ర పోషించారీ నటుడు. 2004లో రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రదీప్. ఇందులో అతను పోషించిన భిక్షు యాదవ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. నిజం చెప్పాలంటే సై సినిమాతో హీరోల కంటే విలన్ గా నటించిన రావత్ కే మంచి పేరు వచ్చింది. సై తర్వాత ప్రదీప్ తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా అవకాశాలొచ్చాయి. భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ,స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబెల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రావత్. కేవలం విలన్ గానే కాకుండా ఓయ్, పూలరంగడు, నేను శైలజా, సరైనోడు వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల్లో కామెడీని కూడా అద్బుతంగా పండించారు ప్రదీప్.

సినిమాల సంగతి తప్పితే ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు… ఈ నటుడి భార్య పేరు కల్యాణి. పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది అనుకుంటున్నారా? అవును.. ఈ ప్రదీప్ రావత్ భార్య తెలుగమ్మాయే. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని పంచుకున్నాడు. కాగా రావత్ ఫేమస్ నటుడు అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ మాత్రం లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అందుకే ప్రదీప్ రావత్ ఫ్యామిలీ బయట ఎక్కడా కనిపించదు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ఈవెంట్లలో కనిపిస్తుంటుంది. ఈ దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు సంతానం. . సినిమాల్లో విలన్ పాత్రల్లో క్రూరంగా కనిపించే ప్రదీప్ రావత్.. ఇంట్లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటారని ఆయన భార్య ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారని కల్యాణి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భార్యతో ప్రదీప్ రావత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!