OTT Movies: ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్స్/ ఓటీటీ సినిమాలివే.. ఫుల్ లిస్ట్ మీకోసం
గత వారంలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు రానున్నాయి. వంద కోట్లు రాబట్టిన అఖిల్ అక్కినేని సినిమా 'లెనిన్' ఈ వీకెండ్ లోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరిన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

ఈ వారం థియేటర్లలో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా సందడి చేయనుంది. దీంతో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘డిసి’, మాధవన్ ‘జీడీ నాయుడు’ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు కూడా థియేటర్లలో రీ రిలీజ్ (ఆగస్టు 09) కానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం దాదాపు 25కు పైగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో అఖిల్ అక్కినేని లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీలో ఏయే సినిమా అందుబాటులోకి రానుందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
- బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 04
- బిగ్ చికెన్: ఏ ఫాస్ట్‌ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 05
- ఇన్‌సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 05
- మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 06
- ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 07
- ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 07
- ద లాస్ట్ హౌస్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 07
- మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) – ఆగస్టు 07
- రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 07
- అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 07
- డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 07
- ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమేటేడ్ మూవీ) – ఆగస్టు 08
జీ5 ఓటీటీలో
- లెనిన్ (తెలుగు సినిమా) – ఆగస్టు 07
- వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 07
- తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) – ఆగస్టు 07
అమెజాన్ ప్రైమ్
- ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 04 (రెంట్)
- స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 05
- వదంది 2 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 07
జియో హాట్‌స్టార్
- ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 04
- ద షార్డ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 05
- ద సూపర్ మారియో గెలాక్సీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 07
మనోరమ మ్యాక్స్
- కాట్టలన్ (మలయాళం సినిమా) – ఆగస్టు 07
ఆపిల్ టీవీ ప్లస్
- టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 04
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




