AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఫ్రెండిషిప్, లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ ఫీల్ గుడ్ సినిమాను ఎగబడి చూసేశారు.

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 02, 2026 | 5:53 PM

Share

కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ చూసేశారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులోనూ రిలీజైన హృదయం మురళి సినిమాకు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి తమిళం, తెలుగులోనూ ఆడియెన్స్ ను అలరించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. హృదయం మురళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 07 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

హృదయం మురళి సినిమాకు ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎన్ఎం, రాంకీ, సుధాకర్, నట్టి సుబ్రహ్మణ్యం, జోనిత గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మనోజ్‌ పరమహంస, సీహెచ్‌ సాయి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. కాలేజీ ఫ్రెండ్ షిప్, ఫస్ట్ లవ్, వన్ సైడ్ లవ్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో హృదయం మురళి సినిమా..

హృదయం మురళి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..
ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇలా ఉంటాయా..! ఇవి ఫాలో అయితే లైఫ్‌లో సక్సెస్
ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇలా ఉంటాయా..! ఇవి ఫాలో అయితే లైఫ్‌లో సక్సెస్
ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. కన్ఫార్మ్ చేసిన గీతా భాస్కర్..
ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. కన్ఫార్మ్ చేసిన గీతా భాస్కర్..
తులసి, శాలిగ్రామాల వివాహం తర్వాతే పెళ్లిళ్లు ఎందుకు మొదలవుతాయి?
తులసి, శాలిగ్రామాల వివాహం తర్వాతే పెళ్లిళ్లు ఎందుకు మొదలవుతాయి?