AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరే.. అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఎంతలా మారిపోయింది.. వీడియో

2009 మిస్ ఇండియా పోటీల నాటి పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో 18 ఏళ్ల వయసున్న ఒక టాలీవుడ్ హీరోయిన్ పాల్గొంది. అప్పట్లో ఆమె ర్యాంప్ వాక్, లుక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Tollywood: అరే.. అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఎంతలా మారిపోయింది.. వీడియో
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 04, 2026 | 6:55 AM

Share

తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమలో స్టార్ నటిగా ఉన్న పూజా హెగ్డేకు చెందిన ఒక పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది ఆమె 2009 ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీలో పాల్గొన్నప్పటి వీడియో. ఈ వీడియోలో, కేవలం 18 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రపంచంలో పూజా హెగ్డే ఎలా ఉందో మనం చూడవచ్చు. అప్పటి ఆమె రూపాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో, తనను తాను ముంబైకి చెందిన 18 ఏళ్ల అమ్మాయిగా పరిచయం చేసుకున్న పూజ, “జీవితంలో గెలవాలంటే కష్టపడాలి, మనం చేసే పని పట్ల అభిరుచి కలిగి ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి” అని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. ర్యాంప్‌పై నడిచినప్పుడు తను ఎదుర్కొన్న మొదటి చిన్న తడబాటు వెనుక ఉన్న రహస్యాన్ని కూడా ఆమె పంచుకుంది. బికినీ, సాంప్రదాయ దుస్తులలో ర్యాంప్‌పై నడిచిన పూజా హెగ్డే, తన గ్లామరస్ లుక్‌కు నేటి రూపానికి చాలా భిన్నంగా ఉండటంతో, ఈ వీడియో చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మోడలింగ్ ప్రపంచం నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన పూజా హెగ్డే, 2012లో వచ్చిన తమిళ చిత్రం ‘ముగముడి’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ముకుంద సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తరవాత ‘అరవింద్ సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో, డీజే వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో ఒకరిగా ఎదిగింది. ఇక హృతిక్ రోషన్ నటించిన ‘మొహెంజో దారో’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది పూజా. అలాగే పాన్-ఇండియా చిత్రాలైన ‘రాధే శ్యామ్’, విజయ్ నటించిన ‘బీస్ట్’లో కూడా హీరోయిన్ గా చేసింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు సరైన విజయాల్లేవు. పూజా హీరోయిన్ గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

18 ఏళ్ల వయసులో పూజా హెగ్డే ఎలా ఉందో చూశారా? వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us