AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ ఎగబడి చూసేశారు. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు తో సహా వివిధ భాషల్లో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

OTT Movie: పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 04, 2026 | 10:00 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర ప్రధాన భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, హృదయం మురళి , వంద దేవుళ్లు, కాట్టలాన్, మై వాసప్ ఆవుంగా లాంటి వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వీకెండ్ లోనే ఓటీటీలోకి రానున్నాయి. అయితే వీటన్నిటి కంటే ముందే ఓ మలయాళం సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో సహా వివిధ భాషల్లోకి ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. గతంలో ‘ఎల వీజ పూంచిర’ అనే మలయాళం సూపర్ హిట్ సినిమాకు రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ అధికారి షాజీ మారడ్.. ఈ సినిమాకు స్టోరీ, డైలాగులు అందించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయి? సిబ్బంది ఎలా ఉంటారు? ఉన్నతాధికారుల పనితీరు, కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి.. ఇలా ఎన్నో అంశాలను ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు.

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లి ప్రాంతంలో ఉన్న ఒక పాడుబడిన బావిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవుతుంది. మొదట ఇది ఒక సాధారణ ఆత్మహత్య లేదా అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, గా దర్యాప్తు చేసే కొద్దీ ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు హత్య చేశారు? యువ పోలీస్ ఆఫీసర్ ఈ క్లిష్టమైన మిస్టరీ కేసును ఎలా ఛేదించాడనేదే ఉయిర్ మూవీ స్టోరీ. కేసు విచారణలో వచ్చే ట్విస్ట్ లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి

ఇవి కూడా చదవండి

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఉయిర్’. ఎమ్.పద్మకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రోషన్ మ్యాథ్యూ హీరో కాగా బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

జియో హాట్ స్టార్ లో రోషన్ మాథ్యూ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us