AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే?

"ప్రతి భారతీయుడి మనసులో రామాయణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి నటీనటుల ఎంపిక, దుస్తులు లేదా వీఎఫ్ఎక్స్ (VFX)పై ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని మేము ఊహించలేదు," అని రామాయణ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ పేర్కొన్నారు.

Ramayana Movie: ‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే?
Ramayana Movie
Basha Shek
|

Updated on: Aug 05, 2026 | 6:45 AM

Share

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ రామాయణం’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఘనత సాధించిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా రామాయణం మూవీ నిలిచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ చిత్రంలోని పాత్రల వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీత పాత్ర పోషించిన సాయి పల్లవి బ్లౌజ్ డిజైన్, కైకేయి పాత్ర పోషించిన లారా దత్తా చీరల డిజైన్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇవి టీవీ సీరియల్‌లోని పాత్రలా కనిపిస్తున్నాయని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.పౌరాణిక చిత్రాల విషయంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం సహజమే అయినా ఈ ట్రోలింగ్ పట్ల రామయాణం కాస్ట్యూమ్ డిజైనర్స్ స్పందించారు. ఇప్పుడు, ఈ విమర్శలన్నింటికీ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్లు రింపిల్ హర్‌ప్రీత్ నారులా సరైన వివరణ ఇచ్చారు.

సాయి పల్లవి వస్త్రధారణపై వచ్చిన విమర్శలపై కాస్ట్యూమ్ డిజైనర్లు స్పందిస్తూ..’ఇలాంటి విమర్శలు, పోలికలు వస్తాయని మాకు తెలుసు. రామాయణం లాంటి ఇతిహాసాన్ని తరతరాలుగా మనం చూస్తున్నాం. కాస్టింగ్, కాస్ట్యూమ్స్‌పై ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటాయి. అవి అంగీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కళ్లు మూసుకుని సీతాదేవిని ఊహించుకొని నేను పురావస్తు ప్రామాణికత గురించి ఆలోచించలేదు. మందిరంలో కూర్చున్న సీత, నా మనసులో ఉన్న ఇమేజ్‌లాగా ఉండాలని కోరుకున్నాను. రీసెర్చ్ అనేది కాస్ట్యూమ్ డిజైన్‌కి పునాది. మనమిచ్చే వివరణతోనే అది కళగా మారుతుంది. ఆ కాలం నాటి వస్త్రాలు మన దగ్గర లేవు. అందరం క్యాలెండర్ ఆర్ట్, శిల్పకళ, ఆధ్యాత్మిక భావన ఉండే చిత్రాలు, రాజా రవి వర్మ చారిత్రక చిత్రాలు చూసి పెరిగాం. రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరుగా వ్యాఖ్యానించారు. ప్రాచీన ఇతిహాసాన్ని కొత్త తరానికి విజువల్‌గా చెప్పే ప్రయత్నం ఇది’ అని రింపుల్‌ చెప్పారు.

ఇక లారా దత్తా (కైకేయి) కాస్ట్యూమ్ డిజైన్‌పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, ‘మేము ఉపయోగించిన ప్రతి రంగుకు ఒక అర్థం ఉంది. ఆకుపచ్చ రంగు మాతృత్వానికి ప్రతీక కాగా, మెరూన్ రంగు కైకేయి తీసుకునే కఠినమైన నిర్ణయాన్ని, అలాగే ఆమెలోని భావోద్వేగ సంఘర్షణను సూచిస్తుంది. ప్రజలు సినిమా కథాంశాన్ని, దానిలోని అంతరార్థాలను అర్థం చేసుకోకుండానే తొందరపడి మా సినిమాను విమర్శిస్తున్నారు.’ అని హర్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. దుస్తుల రూపకల్పన వెనుక ఉన్న కృషి, సృజనాత్మకతను పూర్తి సినిమాను వెండితెరపై చూసిన తర్వాతే స్పందించాలని రామాయణం కాస్ట్యూమ్ డిజైనర్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ