AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ రాశులు మీవేనా?

Surya Nakshatra Transit 2026: నవంబర్ 20న సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 3 వరకు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో మేషం, మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.

సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ రాశులు మీవేనా?
Surya Nakshatra Transit 2026
Rajashekher G
|

Updated on: Nov 19, 2026 | 9:30 PM

Share

Surya Nakshatra Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నాయకత్వ లక్షణాలు, తండ్రి, ప్రభుత్వ రంగం, హోదా, ప్రతిష్టలకు కారకుడిగా పరిగణిస్తారు. సూర్యుడి రాశి సంచారంతో పాటు నక్షత్ర మార్పు కూడా జ్యోతిష్య పరంగా ముఖ్యమైనదిగా భావిస్తారు. సూర్యుడి స్థానం మారినప్పుడు దాని ప్రభావం వ్యక్తుల వృత్తి, ఆర్థిక పరిస్థితి, సామాజిక గౌరవంపై ఉంటుందని జ్యోతిష్య నమ్మకం.ఈ క్రమంలో నవంబర్ 20, 2026న తెల్లవారుజామున 3:09 గంటలకు సూర్యుడు విశాఖ నక్షత్రాన్ని విడిచి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్రానికి శని దేవుడు అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులైనప్పటికీ వారి మధ్య భావజాలంలో విభేదాలు ఉన్నట్లు చెబుతారు. అందుకే శని అధిపతిగా ఉన్న అనురాధ నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సూర్యుడు డిసెంబర్ 3, 2026 వరకు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

మేష రాశి..

మేష రాశి వారికి సూర్యుడి అనురాధ నక్షత్ర సంచారం వృత్తిపరంగా అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభించవచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగం పుంజుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, వాటి ద్వారా ప్రయోజనం కలగవచ్చు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథున రాశి..

మిథున రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఎదురుకావచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభించవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. మీ మాటతీరు, పరిచయాలు ఈ సమయంలో పురోగతికి దోహదపడవచ్చు.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి..

కన్యా రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలను అందించవచ్చు. పనిలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలోనూ క్రమంగా అభివృద్ధి కనిపించవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది అనుకూల సమయం. అయితే పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి ఈ సూర్య సంచారం కొత్త అవకాశాలకు మార్గం చూపవచ్చు. వృత్తి జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహకారం, ప్రోత్సాహం లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, వ్యాపార ప్రతిపాదనలు అందే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు గతంలో రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన ఫలితాలు జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా పేర్కొన్నవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us