AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల్లో నీరసం, రక్తహీనతకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్.. పడుకునే ముందు రెండు తింటే చాలు..

మహిళల ఆరోగ్యానికి ఖర్జూరం ఓ అద్భుత వరం. గజిబిజీ జీవనశైలి, పని ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల నేడు చాలామంది మహిళలు తరచుగా అలసట, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఖరీదైన టానిక్‌లు, సప్లిమెంట్ల కంటే.. రోజువారీ ఆహారంలో కేవలం రెండు ఖర్జూరాలను చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సులభంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Nov 19, 2026 | 6:14 PM

Share
నేటి కాలంలో చాలామంది మహిళలు నీరసం, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. వీటికి చెక్ పెట్టడానికి ఖరీదైన మందులే అక్కర్లేదు.. మన అందుబాటులో ఉండే ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు మహిళల ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి. ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. రోజంతా పనిచేస్తూ తరచుగా అలసట, నీరసంగా అనిపించే మహిళలు వీటిని మితంగా తీసుకుంటే శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.

1 / 5
రక్తహీనతకు చెక్ : మహిళలను ఎక్కువగా వేధించే సమస్య రక్తహీనత. ఖర్జూరాలలో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అయితే కేవలం ఖర్జూరాలపైనే ఆధారపడకుండా ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం ముఖ్యం.

2 / 5
ఎముకల బలానికి: వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఖర్జూరాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేస్తుంది.

3 / 5
అపోహలు - వాస్తవాలు: ఖర్జూరాలలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ, వీటిని తినడం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయనో, అండం నాణ్యత పెరుగుతుందనో లేదా గర్భాశయం బలపడుతుందనో చెప్పడానికి ఇప్పటివరకు తగినంత శాస్త్రీయ ఆధారాలు లేవు. ఖర్జూరాలను పచ్చిగానైనా లేదా కొద్దిగా వేయించుకునైనా తినవచ్చు. అయితే వేయించి తినడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనే ప్రచారంలో కచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

4 / 5
ఎలా తీసుకోవాలి?:  సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తినడం మంచి అలవాటు. అయితే షుగర్ ఉన్నవారు మాత్రం వీటిలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకోవాలి.

5 / 5
Follow Us