Cult OTT: ఇదేం ట్విస్ట్.. 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘#కల్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సినిమా # కల్ట్. ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ సూపర్ హిట్ కాకపోయినా ఉన్నంతలో బాగానే ఆడింది. అయితే ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలో ప్రత్యేక్షమైంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ క్రైమ్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ # కల్ట్. ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న రిలీజైన కల్ట్ సినిమా బాగానే ఆడింది. మరీ సూపర్ హిట్ రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో యూత్ కు బాగా నచ్చేసింది. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కల్ట్ సినిమాను చూడలేకపోయారు. దీంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే కల్ట్ సినిమా మాత్రం కేవలం 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. గురువారం (నవంబర్ 19) నుంచే కల్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.
కల్ట్ సినిమా విషయానికి వస్తే.. తారక్ సినిమా బ్యానర్‌పై సందీప్ కాకరాల ఈ సినిమాను నిర్మించారు. కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ రవిబ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. గోవాకు సరదాగా గడపడానికి వెళ్లిన కొంతమంది యువకులు పార్టీ కోసం ఒక రహస్య దీవిలోకి వెళతారు. అయితే అక్కడ కొందరు దండగులు ఆ ఐలాండ్ లోకి అడుగు పెడతారు. గేమ్ ఆడాలంటూ పార్టీలో ఉన్న కొందరిని దారుణంగా చంపేస్తారు. అలా పార్టీ వేడుకగా మొదలైన సంబరం, వరుస హత్యలు, ఉత్కంఠభరిత పరిణామాలతో ప్రమాదకరంగా మారుతుంది. అలా పబ్‌లో ఉన్న వారిలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా ఉంటారు. మరి పార్టీలో ఉన్న 300 మందిని డీఎస్పీ సంకల్ప్ ఎలా కాపాడారు? 300 మంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రక్తపాతంతో కూడిన భయానక ఆట ఆడారు? అనేది తెలియాలంటే కల్ట్ సినిమా చూడాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ లో విశ్వక్ సేన్ కల్ట్
#CULT (Telugu) is now streaming on Amazon Prime Video in Hindi dubbed version!
Director: #VishwakSen Featuring: Vishwak Sen, Gayatri Bhardwaj, Tarak Ponnappa & others.
Audios: Hindi, Tamil, Telugu, Kannada & Malayalam.
IMDb: 7.2/10
#CultMovie #HindiDubbed https://t.co/lWHn0d8lD9
— Prime Play (@primeplaytweets) November 18, 2026
కల్ట్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
