AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో ఆలస్యమైనా నో టెన్షన్.. ఆర్బీఐ అదిరిపోయే వార్త.. వడ్డీల నుంచి రిలీఫ్..

ప్రస్తుత రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే వడ్డీ, లేట్ ఫీజులు విధిస్తారనే విషయం తెలిసిందే. ఈ మేరకు కార్డుదారులకు ఆర్బీఐ భారీ ఊరట కలిగించింది. మూడు రోజుల గ్రేస్ పీరియడ్ అనేది విధించింది.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో ఆలస్యమైనా నో టెన్షన్.. ఆర్బీఐ అదిరిపోయే వార్త.. వడ్డీల నుంచి రిలీఫ్..
Credit Card
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2026 | 9:39 PM

Share

క్రెడిట్ కార్డ్. ఇప్పటిరోజుల్లో ఎవరి దగ్గర చూసినా ఈ కార్డ్ కనిపిస్తుంది. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆఫర్లలో వస్తువులు కొనడం, పెట్రోల్ బంకుల్లో ఉపయోగించడం లేదా నగదు అవసరైనప్పుడు విత్ డ్రా చేసుకుని ఆర్ధిక అవసరాలను తీర్చుకునేందుకు చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే బిల్లు జనరేట్ అయిన తర్వాత గడువులోగా చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ డ్యూ డేట్ దాటిన తర్వాత కూడా చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవ్. సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపించడంతో పాటు అదనపు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య ఫీజులతో మీరు చెల్లించాల్సింది మరింత ఎక్కువగా మారుతుంది. దీంతో క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమంది తమ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్‌గా క్రెడిట్ కార్డు బిల్లు కట్ అయ్యేలా ఆటో పేమెంట్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటారు. దీంతో మీ క్రెడిట్ కార్డు బిల్లు డ్యూడేట్ రోజు లేదా ముందే మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యి క్రెడిట్ కార్డు బిల్లుకు చెల్లింపులు జరుగుతాయి. కొన్నిసార్లు సర్వర్ సమస్యలు, ఇతర టెక్నికల్ కారణాల వల్ల డ్యూ డేట్ తర్వాత డబ్బులు కట్ అవ్వవచ్చు. ఇలాంటి సందర్భాల్లో లేట్ ఫీజులు కూడా పడతాయోమోనని చాలామంది అనుకుంటారు. కానీ అలా జరిగితే వడ్డీ చెల్లించనక్కర్లేదు. ఈ మేరకు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. బిల్లు గడువు తేదీ ముగిశాక మూడు రోజుల వరకు గ్రేస్ పీరియడ్ విధించింది. దీంతో ఈ మూడు రోజుల్లోగా చెల్లింపులు జరిగినా ఎలాంటి వడ్డీ పడదు. మూడు రోజుల తర్వాత కూడా చెల్లించకపోతే వడ్డీలు పడతాయి.

ఈ కారణం వల్ల గడువు తేదీ ముగిశాక మూడు రోజుల్లోపు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయి బిల్లు చెల్లింపు జరిగినా ఎలాంటి వడ్డీ పడదు. దీని వల్ల గురించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో క్రెడిట్ బ్యూరోలకు కూడా లేట్ పేమెంట్ రిపోర్ట్ చేయకూడదని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నారు. అయితే మూడు రోజుల తర్వాత కూడా చెల్లించకపోతే వడ్డీలు పడతాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఒక్కో బ్యాంకు ఒక్కోలా ఛార్జీలు విధిస్తుంది. నెలకు 2.5 శాతం నుంచి 3.75 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారు ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి.

Follow Us