AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా? భార్య కూడా తెలుగులో స్టార్ హీరోయిన్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఇతను SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లిపోయాడు. అక్కడే ఉద్యోగం చేస్తూనే సినిమాలను తెరకెక్కించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

Tollywood: ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా? భార్య కూడా తెలుగులో స్టార్ హీరోయిన్
Tollywood Director
Basha Shek
|

Updated on: Aug 06, 2026 | 6:30 AM

Share

పై ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులను చూశారా? అందులో ఒకరు నేడు పాన్ ఇండియా స్టార్ .అలాగనీ అతను స్టార్ హీరో ఏమీ కాదు. అయితే అంతకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ ఇటీవల మరింత పాపులర్ అయ్యాడు. కారణం అతను ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. ఇప్పటికే ఒకసారి వివాహమై భార్యతో విడాకులు తీసుకున్న ఈ డైరెక్టర్ కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఇటీవలే భార్యను లీడ్ రోల్ పెట్టి సినిమా కూడా తీశాడు. ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథ కూడా అందించాడు. గత నెలలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో?యస్. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సమంత భర్త రాజ్ నిడిమోరు.

కాగా ఆగస్టు 04న రాజ్ నిడిమోరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాజ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో రాజ్ సోదరి శీతల్ కూడా సోషల్ మీడియా వేదికగా తన సోదరుడికి బర్త్ డే విషెస్ చెప్పింది. చిన్నప్పటి నుంచి వివిధ సందర్భాల్లో రాజ్ తో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది శీతల్. అలా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో పై ఫొటోకూడా ఉంది.

ఇవి కూడా చదవండి

చిన్నప్పుడు సోదరితో సమంత భర్త రాజ్ నిడిమోరు..

కాగా సమంత నటించిన లేటెస్ట్ సినిమా ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు రాజ్ నిడిమోరు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సమంతతో రాజ్ ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us