AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. ఈ ఏడాది ఇప్పటికే ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీలో నటించింది శ్రీలీల. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.

Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?
Actress Sreeleela
Basha Shek
|

Updated on: Aug 05, 2026 | 10:14 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయాన్ని సందర్శించింది. అక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ క్రమంలో ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే శ్రీలీల మాత్రం ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల అరుణాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీలీల. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా అనే బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

అయితే ఇక్కడే శ్రీలీలకు దురదృష్టం స్టార్ట్ అయ్యింది. ధమాకా తర్వాత శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్, మాస్ జాతర, ఇక రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఒక్క భగవంత్ కేసరి సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి తోడు ఇటీవల శ్రీలీల మధ్యలో తప్పుకున్న సినిమా లెనిన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే అజిత్ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే ధనుష్ నటిస్తోన్న ఓమ్ సినిమాలో కథానాయికగా చేస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!