శ్రీలీల

శ్రీలీల

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న సెన్సేషనల్ హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లి సందD  సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది. శ్రీలీల నటించిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా.. శ్రీలీల చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది..

ఇంకా చదవండి

Sreeleela: అందరిలానే శ్రీలీల కూడా.. తెలుగులో ప్రయాణం మొదలుపెట్టి బీ టౌన్ పై ఫోకస్..

ప్లాన్ A వర్కవుట్ కానపుడు కచ్చితంగా ప్లాన్ B ఉండాల్సిందే. ఇప్పుడు ఇదే అప్లై చేస్తున్నారు శ్రీలీల. ఇన్నాళ్ళూ తెలుగులో సత్తా చూపించిన ఈ బ్యూటీ.. ఇకపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీపై ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసారు. ఈ క్రమంలోనే అమ్మడి చూపు ముంబైపై పడింది. మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది..? టాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడెంత మెరిసినా.. చివరికి వాళ్లు చేరాల్సిన గమ్యం మాత్రం బాలీవుడ్డే.

RT75 Movie: మరోసారి ధమాకా జోడి.. గ్రాండ్ గా లాంచ్ అయినా మూవీ..

మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు.

Sreeleela: చేతులు కాలాక ఆకులు పడితే ఎలా పాప.? శ్రీలీల కన్ఫ్యూషన్..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

Sreeleela: అబ్బా ఏం అందం గురు.. చీరకట్టుతో వయ్యారాలు వడ్డిస్తున్న శ్రీలీల.

చేయడానికి సినిమాల్లేవు.. కొత్తగా ఇప్పుడు ఆఫర్స్ వచ్చేలా కూడా కనిపించడం లేదు.. అందుకే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఛిల్ అవ్వడమే బెటర్ అని ఫిక్సైపోయారు శ్రీలీల. దశ తిరిగేవరకు.. దేశాలు తిరిగేద్దాం అని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు ఈ బ్యూటీ. మధ్య మధ్యలో మంచి మంచి ఫోటోషూట్స్‌తో కాలం గడిపేస్తున్నారు. తాజాగా మరో ఫోటోషూట్‌తో పిచ్చెక్కించారు ఈ భామ. ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టమే.

Sreeleela: సమంత చెప్పిన మాటలు సీరియస్‌గా తీసుకున్న శ్రీలీల..!

అప్పుడెప్పుడో సమంత చెప్పిన మాటల మీద సీరియస్‌గానే వర్కవుట్‌ చేస్తున్నారు నటి శ్రీలీల. ఇంతకీ సమంత ఏం చెప్పారా అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి పని చేసిన టీమ్‌తో మళ్లీ మళ్లీ చేయాలని.. కాంబినేషన్లను రిపీట్‌ అవుతున్న కొద్దీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని.. సామ్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ని సిన్సియర్‌గా ఫాలో అవుతున్నట్టున్నారు శ్రీలీల. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల వేసి స్టెప్పులకి, స్టేజ్‌ మీద ఈ బ్యూటీ గురించి మహేష్ చెప్పిన మాటలకీ..

Sreeleela: అద్భుతమైన అవకాశం తలుపు తడితే.. సింపుల్‌గా నో చెప్పిన శ్రీలీల..?

గ్లామర్‌ వరల్డ్ లో అంత మందిని దాటుకుని ఓ అవకాశం తలుపు తట్టడం అంటే మామూలు విషయం కాదు. అలా వచ్చిన అవకాశాలను చూసి... ' సారీ, ఇప్పుడు కాదు.. ఇంకోసారి' అని చెప్పగలగడం కూడా ఈజీ ఏం కాదు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది శ్రీలీల కెరీర్‌లో. అద్భుతమైన అవకాశం తలుపు తడితే, సారీ అంటూ సింపుల్‌గా చెప్పేశారట శ్రీలీల. గట్సీ గర్ల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు జనాలు.

Crazy Songs: కమర్షియల్‌ హిట్స్ కోసం మాస్ బీట్స్.. ఏంటా సాంగ్స్.?

పక్కా కమర్షియల్‌ సినిమా అన్నాక హీరో హీరోయిన్లు దుమ్ము రేపే స్టెప్పులు వేసేయాలి. స్టేజ్‌ దద్దరిల్లేలా చేసే అలాంటి డ్యాన్సులకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. హీరో పక్కన ఓ హీరోయిన్‌ ఉంటేనే అంత క్రేజ్‌ ఉంటే, సాంగ్‌లో హీరోకి చెరో వైపు ఇద్దరు కనిపిస్తే... ఆ మాస్‌ బీట్లను కోరుకోకుండా ఎవరుంటారు చెప్పండి అంటారా?  ఈ తరహా పాటలు నార్త్ లోనే కాదు... సౌత్‌లోనూ కోకొల్లలు. రీసెంట్‌గా... 'దానికేమో మేకలిస్తివి.. నాకేమో సన్నబియ్యం నూకలిస్తివీ' అంటూ గుంటూరు కారంలో క్లిక్‌ అయిన కుర్చీ మడతపెట్టి పాట ఇలాంటిదే.

Sreeleela: ఈ క్యూటీ గ్లామర్ కి ఎలాంటి అందమైన గులాం అవ్వాల్సిందే.. క్రేజీ లుక్స్ వైరల్..

శ్రీలీల ప్రధానంగా తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె 2017లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2019 కన్నడ కిస్‌తో పాటు తెలుగులో పెళ్లి సందడి, ధమాకా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఉత్తమ నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది ఈ బ్యూటీ. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్న ఈ వయ్యారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి.. 

Sreeleela: ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!

త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దళపతి తన పెండింగ్​ మూవీ ప్రాజెక్ట్స్​ను పూర్తిచేసుకుని రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. దీంతో అయన నటించే చివరి రెండు సినిమాలపై ఫ్యాన్స్​ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. ఆ రెండు ఫిల్మ్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ ఒకటి. ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. కానీ ఈ భామ దానికి నో చెప్పిందని టాక్‌.

Sreeleela: పాత అలవాటును శ్రీలీల మానుకోలేదా.? అందుకేనా మళ్లీ ఇలా..

ఇండస్ట్రీ లో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తునప్పుడే కాదండోయ్.. క్యాట్ వాక్ చేసేప్పుడు అలానే ఆలోచిస్తున్నారు.. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారని.. అందులోనూ ఒక స్టార్ హీరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనేది టాక్. ఇంతకీ ఏంటా మూవీ.? ఎవరా ఆ హీరో.? బుజ్జిబుజ్జిగా టాలీవుడ్ లో అడుగులు వేస్తునప్పుడే సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా వరస సినిమాలకు సైన్ చేసారు శ్రీలీల.

TOP9 ET: టార్గెట్ రూ.1000 కోట్లు.. ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌ పోటీ.

01.ntr: దిమ్మతిరిగే రేంజ్‌లో.. వీరిద్దరి మధ్య డ్యాన్స్‌ ఫోటీ.! యంగ్ టైగర్ ఎన్టీర్, బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్! ఈ ఇద్దరూ డ్యాన్స్‌లో కింగ్‌లే.. అలాంటి ఈ ఇద్దరూ.. ఓ సాంగ్‌లో డ్యాన్స్‌తో తలపడితే ఎలా ఉంటుంది. థియేటర్లు బద్దలయ్యే రేంజ్‌లో ..సిల్వర్ స్క్రీన్‌ చిరిగే రేంజ్లో ఉంటుంది కదా..! ఎగ్జాక్ట్‌గా ఇదే అనుకున్నారో ఏమో కానీ వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జి.. ఈ ఇద్దరి మధ్య ఓ డ్యాన్స్‌ నెంబర్‌ను సెట్ చేశారట. […]

Sreeleela: అయ్యో..! కొత్త ఆఫర్ల కోసం.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు…

సినిమా ఛాన్సులు వస్తూనే ఉండాలంటే.. ఒకప్పటి అమ్మమ్మలా కాకుండా ఎప్పుడూ కొత్త కొత్తగా కనిపించాలి. పాత చింతకాయ పచ్చడిలా కాకుండా.. థాయ్‌ సూప్‌లా టేస్టీగా ఉండాలి. అందుకే అన్నట్టు.. ఇందుకోసమే అన్నట్టు శ్రీలీలీ తెగ కష్టపడుతున్నారు. రింగు రిగుల జుట్టు మేకోవర్‌తో..

Sreeleela: శ్రీలీల దెబ్బకు పాపం హీరోలు.. ఎంత కష్టపడతారో..!

తాను చేసే డ్యాన్సులకన్నా, సెట్లో హీరోలు చేసే యాక్షన్‌ సీక్వెన్స్ చాలా కష్టమని అన్నారు నటి శ్రీలీల. హీరోలు ఫైట్స్ కోసం కష్టపడే తీరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. చిన్నప్పటి నుంచీ తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పారు. డ్యాన్సులను... వాటిని ప్రదర్శించడం వల్ల పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పారు శ్రీలీల.

Heroines: కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.. కొత్త ఇమేజ్ కోసం హీరోయిన్లు..

ఎంతసేపూ ఒకే తరహా కారెక్టర్స్ ఏం చేస్తాం చెప్పండి..? ఓ స్టేజ్ దాటాక చూసే వాళ్లకు.. చేసే వాళ్లకు ఇద్దరికీ బోర్ కొడుతుంది. అందుకే కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అంటున్నారు మన హీరోయిన్లు. ఉన్న ఇమేజ్ పోయినా పర్లేదు.. కొత్త ఇమేజ్ కావాలంటున్నారు. మరి అలా ఇమేజ్ మేకోవర్ కోసం తంటాలు పడుతున్న హీరోయిన్లెవరో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

Sreeleela: పాపం శ్రీలీలకు ఎంత కష్టమొచ్చింది.! అవకాశాలు తగ్గినట్టేనా.?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆపర్లు ఉండగానే అందిపుచ్చుకోవాలి. కొన్నిసార్లు కారణాలు ఏవీ లేకపోయినా, ఉన్నట్టుండి జీవితం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న బిజీ గుర్తుకొస్తే మరింతగా ఉస్సూరుమనిపిస్తుంది. ఏమిటి శ్రీలీలా అంతేనా.? అదేంటి శ్రీలీలను ప్రస్తావిస్తున్నారు ఈ మాటలకూ, శ్రీలీలకూ లింకేంటి అంటారా? వామ్మో... ఆ ఆఫర్లేంటి? ఆ క్రేజీ ప్రాజెక్టులేంటి? అసలు శ్రీలీలకు తినడానికైనా టైమ్‌ ఉంటోందా? లేదా?

Latest Articles
హోటల్‌కి పిలిచి మరీ ప్రియుడి పీకకోసి హత్యాయత్నం చేసిన ప్రియురాలు
హోటల్‌కి పిలిచి మరీ ప్రియుడి పీకకోసి హత్యాయత్నం చేసిన ప్రియురాలు
వాహనదారులకు షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
వాహనదారులకు షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
తారక్ ఫ్యాన్స్ కి పండగే.. అనుకున్న టైమ్‌ కన్నా ముందే రానున్న దేవర
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
పువ్వుల ప్రేమికులా.. ఈ లోయపై ఓ లుక్ వేయండి.. ఏ సీజన్ బెస్ట్ అంటే
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!
మీరు ఈ తప్పులు చేస్తున్నారా? మీ వాట్సాప్‌ శాశ్వతంగా నిషేధం!