ఈ చిన్నది ఇండస్ట్రీలో తోప్.. ఒకొక్క సినిమాకు రూ.7కోట్లు.. స్పెషల్ సాంగ్‌కు రూ. 2కోట్లు
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. ఇక ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.?

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఏళ్లపాటు కొనసాగడం అంటే మాములు విషయం కాదు. అలా అందం, అభినయంతో పాటు క్రమశిక్షణ, నిరంతరం నేర్చుకునే తత్వం వంటి లక్షణాలు ఉండాలి. అలా కాకుండా ఏదో బండి లాంగిచేద్దాం అనుకుంటే నాలుగు సినిమాల తర్వాత షెడ్డుకు వెళ్లిపోవాల్సిందే. అలా చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. మరికొంతమంది మాత్రం వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ఇక చిన్నప్పడు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవారికి కొన్ని ఫేవర్స్ ఉంటాయ్. వారికి కొన్ని ఫేవర్స్ ఉంటాయి. కెమెరా ఫీయర్ అస్సలు ఉండదు. యాక్టింగ్‌లో అన్ని మెలుకువలు కూడా తెలిసి ఉంటాయ్. అలా చైల్డ్ ఆర్టిసులుగా వచ్చి.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. ఒకప్పటి శ్రీదేవి నుంచి నిన్నమొన్నటి కావ్య కల్యాణ్ రామ్ వరకు అదే బ్యాచ్. పైన మీరు చూస్తున్న అమ్మాయి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇంతకీ ఆమె మీరు గుర్తుపట్టారా..?
ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..
ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా చెలామణి అవుతుంది. అమ్మడి డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. ఒక ఏడాది వరకు ఆమె డేట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయ్. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించి మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతలా ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. పై ఫొటోలో ముద్దుగా ఉన్న ఆ చిన్నారి మన తెలుగమ్మాయి శ్రీలీలనే. చాలామంది శ్రీలీల ఫస్ట్ తెలుగు సినిమా పెళ్లి సందడి అనుకుంటారు. కానీ అంతకంటే ముందే బాలనటిగా ఓ మూవీలో నటించింది. అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రాంగద సినిమాలో సింధు తులానీ చిన్నప్పటి పాత్రలో కనిపించింది శ్రీలీల.
ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
ఇప్పుడు ఫేస్‌కట్స్ బాగా గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. MBBS చదువుతున్న ఈ డాక్టరమ్మ.. కన్నడ మూవీ కిస్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భారతే అనే సినిమాలో యాక్ట్ చేసింది . రెండేళ్ల గ్యాప్ తీసుకుని పెళ్ళి సందడి మూవీతో తెలుగులోకి వచ్చింది. ఆ సినిమాలో అమ్మడి లుక్స్‌కు, డ్యాన్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకాలో శ్రీలీల నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస పెట్టి ఛాన్సులు అందుకుంది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాల్లో నటించింది. వీటిల్లో గుంటూరు కారం, భగవంత్ కేసరి బాగా ఆడాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తుంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతుంది. మొన్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో రచ్చ లేపింది ఈ అమ్మడు. అలాగే ఈ భామ మొన్నటి వరకు ఒకేఒక్క సినిమాకు రూ. 3 నుంచి రూ. 4కోట్లు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది 7 కోట్లు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్.
ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








