AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. ఎవరెవరు విచ్చేశారంటే

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు

Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. ఎవరెవరు విచ్చేశారంటే
Virosh
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 10:04 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంటను ఆశీర్వదించాడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి  సందడి చేశారు. విజయ్ రష్మిక వివాహం గత నెల 26న జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో విజయ్, రష్మిక పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఎక్కువ మంది హాజరు కాలేదు. అతికొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం ఇటీవలే చేసుకున్నారు. ఇక తాజాగా విజయ్, రష్మిక రిస్పెషన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది.

ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కేటీఆర్, డీకే అరుణ, మల్లారెడ్డి ఫ్యామిలీతో హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ, మాజీ మంత్రి తలసాని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా హాజరయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన, నాని, నవీన్ పోలిశెట్టి, అల్లు అర్జున్, మహేష్ బాబు సతీమణి నమ్రత, మహేష్ కూతురు సితార హాజరయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, రానా ఆయన సతీమణి, దర్శకుడు బోయపాటి, హీరో కార్తీ హాజరయ్యారు.

అదేవిధంగా దర్శకుడు సుకుమార్ ఆయన సతీమణి, రవితేజ, నిర్మాత దిల్ రాజు ఆయన సతీమణి, వెంకటేష్, నాగార్జున ఆయన సతీమణి అమల, నాగ చైతన్య , దర్శకుడు శేఖర్ కమ్ముల ఫ్యామిలీ మరికొంత మంది సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us