విశాఖపట్నం ఆటో నగర్లో సర్వీసింగ్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. అప్రమత్తమైన డ్రైవర్ నాగరాజు వెంటనే బస్సును ఆపి కిందకు దిగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.