తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నిప్పులగుండంలా విజయవాడ, వరంగల్
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న వారం రోజులలో పాటు భారీ ఎండలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలలో వడగాడ్పుల తీవ్రత పెరగబోతోందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది.
సోమవారం కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండలో బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఏపీలోని విజయవాడలో, తెలంగాణలోని వరంగల్‌లో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం 51 మండలాల్లో తీవ్రడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల విభాగం తెలిపింది. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 18 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు… కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం రోజున రాష్ట్రంలో అత్యధికంగా కడప జిల్లాలో పొట్టిపాడులో 43.8°C, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1°C, నంద్యాల జిల్లాలో 42.9°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి
విమానం ల్యాండ్ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసి..
14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన!
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

