అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం నిల్లు..

Rajeev 

13 April 2026

చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటారు అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి ఒకరు.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సిమ్రాన్ చౌదరి. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది.

ఈ నగరానికి ఏమైంది సినిమా హిట్ అయినప్పటికీ సిమ్రాన్ చౌదరికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

సరైన సినిమా కోసం చాలా కాలం ఎదురుచూసింది ఈ చిన్నది. దాంతో అంతగా క్రేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఇక చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

సిమ్రాన్ సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.