త్వరలో నన్ను కూడా చంపేస్తారేమో!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయారెడ్డి, తన ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ఆమె భర్త సురేందర్ రెడ్డి తన అత్తమామలు, బావమరిది, వదినపై సంచలన ఆరోపణలు చేశారు. వారికి ఆస్తులు, డబ్బుపై ఆశ ఉందని, తన ప్రాణాలకు హాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయారెడ్డి మృతి వెనుక అనేక అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. విజయా రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి, తన అత్తమామలు, బావమరిది, వదినపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు హాని ఉందని, విజయా రెడ్డి ఆత్మహత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. విజయా రెడ్డి మరణానంతరం తన ఆస్తుల పత్రాలు, బంగారం, డబ్బు తన అత్తగారి వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి అడిగితే రూ. 70 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను చనిపోతే ఆస్తులు ఎవరికి చెందుతాయని తన అత్తగారు ప్రశ్నించడం తనకు అనుమానాలకు తా విచ్చిందని తెలిపారు. విజయా రెడ్డి హ్యాండ్ బ్యాగ్‌లు తెరిచి ఉండటం, ఆమె డైరీ, ఇతర కీలక పత్రాలు కనిపించకుండా పోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి
విమానం ల్యాండ్ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసి..
14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన!
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

