కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ నిధులతో నిర్మించిన తారు రోడ్డు నెల రోజుల్లోనే పాడైపోయింది. నాణ్యత లోపంపై గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవల కోసం రోడ్డే ఆధారమని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు.