తెలుగులోకి రీఎంట్రీకి రెడీ అయిన క్రేజీ హీరోయిన్.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

14 April 2026

తెలుగు, తమిళ చిత్ర పరిశర్మలో తనదైన నటనతో.. ఆకట్టుకునే రూపంతో, అందమైన చిరునవ్వుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్.  

 కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్న కథలను ఎంచుకుంటూ సౌత్ అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 

అయితే ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఎక్కడా స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.

 గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తుంది. మొన్నటివరకు కార్ రేసింగ్ చేస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. 

అదే సమయంలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో ప్రేమలో పడింది. అతడితో ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా బయటపెట్టింది.

కానీ అనుహ్యంగా కొన్ని రోజులే వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. అలాగే రాజ్ హిత్ కు మరో యువతితో నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు నివేదా మరోసారి తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈబ్యూటీ ప్రస్తుతం రీఎంట్రీ కోసం సిద్ధమైందని టాక్ నడుస్తుంది.

దక్షిణాదిలో మంచి ఛాన్స్ వస్తే సినిమాల్లో తిరిగి నటించాలని ఆసక్తి చూపిస్తుందట. హీరోయిన్ పాత్రలే కాకుండా ముఖ్యమైన పాత్రలు పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.