సినిమాలు లేవ్.. సోషల్ మీడియాతో అభిమానులను కవ్విస్తున్న కావ్య
Rajeev
04 march 2026
తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్స్ లో నటించి మెప్పించారు.
పదుల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఇప్పుడు హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు..ఆమే క్రేజీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.
ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్.
తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది.
బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది.
శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది.