AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

వెండితెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అలరించి.. తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మెరిసి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఒకటి, రెండు చిత్రాలతో తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిపోయారు.

143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
143 Movie
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2025 | 7:22 PM

Share

ఇప్పుడంటే బోల్తా పడుతున్నాడు కానీ.. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. హీరోలను నెక్ట్స్ రేంజ్‌కు ఎలివేట్ చేసిన చరిత్ర ఆయనది. ఒకటా, రెండా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన 143 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. 2004 విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది.  బ్రహ్మానందం , బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్‌కు జోడీగా నటించిన కథానాయకి మీకు గుర్తుందా..?  తను ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది.. తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఆ హీరోయిన్ పేరు సమీక్ష సింగ్. తను తెలుగు, తమిళం, కన్నడ,  పంజాబీ, హిందీ భాషల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. అంతే కాదు.. చాలా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. సమీక్ష సింగ్ ఫస్ట్ మూవీ 143నే. ఈ సినిమా తర్వాత ఈ భామ వరస సినిమాలు చేసింది.  అరింతుమ్ అరియమలుమ్‌ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టింది. 143 సినిమా తర్వాత కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి తెలుగు సినిమాల్లో పాత్రలు పోషించింది. అలాగే పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 2020లో, సింగపూర్‌లో సింగర్ షేల్ ఓస్వాల్‌ని సమీక్షసింగ్ మ్యారేజ్ చేసుకుంది. భర్తతో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాను ప్రొడ్యూస్ చేసింది.  సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మంచి యాక్టవ్. తన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి…

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి