War 2 Pre Release Event: తారక్ మాస్ ఎంట్రీ.. పూనకాలతో ఊగిపోయిన అభిమానులు..
దేవర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో వార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై హైప్స్ తారా స్థాయికి చేరాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి.

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరో క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. తాజాగా వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు .హృతిక్ రోషన్ తో కలిసి ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టారు. తన ఎంట్రీతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను షేక్ చేశారు తారక్. ముఖ్యంగా తారక్ లు అందరిని ఆకట్టుకుంది. తారక్ ను చూడగానే అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఇక వార్ 2 చిత్రంలో కియార అద్వానీ హృతిక్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.




