తన జీవితంలో పాలు, పూలు అమ్ముతూ గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. స్కూళ్లు, కళాశాలలు స్థాపించి, ఎంపీ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. భగవంతుడి దయ, నిరంతర కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని, తన ప్రగతిని తను కూడా నమ్మలేకపోతున్నానని విశ్లేషించారు.