ఏం అమ్మాయి రా బాబు.. నీలి కళ్లతో మాయ.. కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది
Rajitha Chanti
Pic credit - Instagram
14 March 2026
సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన బ్యూటీస్ గురించి తెలిసిందే.
అందులో దివ్య భారతి ఒకరు. తమిళంలో బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఓవర్ నైట్ స్టా్ర్ అయిపోయింది ఈ భామ.
ముఖ్యంగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత అనే చెప్పాలి.
తమిళంలో వరుస సినిమాలలో నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది దివ్య భారతి.
చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన సాంగ్ ఆకట్టుకుంది. మరోవైరు సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు తన స్టైలీష్ ఫోటోలతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆమె సొగసైన బోల్డ్ ఫ్యాషన్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్రౌన్ కలర్ దుస్తులలో కట్టిపడేస్తుంది.
ఇప్పుడిప్పుడే తెలుగులో విపరతీమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఈ అమ్మడు.. తన ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే ఆ సినిమా దర్శకుడి తీరుపై మండిపడింది.
తనను చిలక అంటూ పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు వివాదాలతోనే పాపులర్ అయిన ఈ అమ్మడు తెలుగులో సరైన ఆఫర్స్ కోసం చూస్తుంది.